అంటే ఇటు పవన్‌, అటు చిరంజీవి మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాక్సాఫీసు(Box Office) దగ్గర ఈ ఫైట్‌ మాత్రం యమ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బ్రో సినిమానేమో వినోదయ సీతం రీమేక్‌.. భోళాశంకర్‌ సినిమానేమో వేదాళం చిత్రానికి రీమేక్‌.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి మాత్రం ఒరిజనల్‌ స్టోరీతో తీసిన సినిమా. ఇందులో బోల్డంత కామెడీ ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏది హిట్టవుతుందన్నది ఆసక్తిగా మారింది.

సినిమా అభిమానులకు సమ్మర్‌ చాలా డల్‌గా గడిచిపోయింది. వేసవిలో వచ్చే సినిమాలు సక్సెసవుతాయంటారు కానీ ఈ సమ్మర్‌లో వచ్చిన సినిమాలేవీ పెద్దగా రాలేదు. వచ్చినవి పెద్దగా ఆడలేదు. చాలా మట్టుకు చిన్న సినిమాలే వచ్చాయి.ఇందులో హిట్ కొట్టినవి చాలా తక్కువ. మాన్‌సూన్‌ సీజన్‌ వచ్చేసింది. బాక్సాఫీస్‌ దగ్గర సందడి మొదలయ్యింది. రాబోయే రెండు మూడు నెలలు ఇంతే హడావుడి ఉంటుంది. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

జనరల్‌గా ఓ పెద్ద సినిమా రిలీజైనప్పుడు మరో పెద్ద సినిమా విడుదల కాదు.. ఆ అండర్‌స్టాండింగ్‌ మేకర్స్‌కు ఉంది. శ్రావణంలో వచ్చే సినిమాల్లో ఒక ఫైట్‌ మాత్రం ఆసక్తిని రేపుతోంది. టాప్‌ హీరోయిన్‌ అనుష్క షెట్టి(Anushka Shetty) తెలుగులో సినిమా చేసి చాన్నాళ్లయ్యింది. ఇంతకాలానికి ఆమె తెలుగులో ఓ సినిమా చేస్తోంది. సినిమా పేరు మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి(Miss Shetty, Mr.Polishetti). జాతిరత్నాలు(Jathirathnalu) సినిమా తర్వాత నవీన్‌ పోలిశెట్టి(Naveen Polishetti) హీరోగా నటించిన సినిమా ఇదే! మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌ను కొన్నాళ్ల కిందట విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. థియేటర్‌లో సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినిమా బృందం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

ఆగస్టు 4వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్టు చెప్పింది. అయితే ఆ వారం పెద్దగా సినిమాలేమీ విడుదల కావడం లేదు కానీ దానికి వారం ముందే అంటే జులై 28వ తేదీన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej) కలిసి నటించిన బ్రో(Bro) సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది. మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి విడుదలైన వారం రోజుతకు అంటే ఆగస్టు 11వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్‌(Bhola Shankar) థియేటర్లలో వస్తుంది.

అంటే ఇటు పవన్‌, అటు చిరంజీవి మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాక్సాఫీసు(Box Office) దగ్గర ఈ ఫైట్‌ మాత్రం యమ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బ్రో సినిమానేమో వినోదయ సీతం రీమేక్‌.. భోళాశంకర్‌ సినిమానేమో వేదాళం చిత్రానికి రీమేక్‌.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి మాత్రం ఒరిజనల్‌ స్టోరీతో తీసిన సినిమా. ఇందులో బోల్డంత కామెడీ ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏది హిట్టవుతుందన్నది ఆసక్తిగా మారింది.

Updated On 3 July 2023 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story