అనుష్క షెట్టి(anushka shetty) సినిమాలు బాగా తగ్గించేసింది. రెండు దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నా వెళ్ల మీద లెక్కపెట్టే చిత్రాలే ఆమె ఖాతాలో వున్నాయి.
అనుష్క షెట్టి(anushka shetty) సినిమాలు బాగా తగ్గించేసింది. రెండు దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నా వెళ్ల మీద లెక్కపెట్టే చిత్రాలే ఆమె ఖాతాలో వున్నాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్‌ను సంపాదించుకున్న అనుష్క అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేస్తూ వస్తున్నది. నాగార్జున(Nagarjuna) హీరోగా వచ్చిన సూపర్(super) సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ అప్పట్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంది. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. చిన్న హీరోలతో కూడా నటించింది. అయితే అరుంధతి(Arundhathi) సినిమాతో అనుష్క లెవల్ మారింది. బాహుబలి(Bahubali) సినిమా ఆమెకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సైజ్ జీరో సినిమా చేసింది. అప్పట్నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క మళ్లీ బరువును తగ్గించుకోలేకపోయింది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్‌లు తగ్గిపోయాయి. బయట కనిపించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. కొన్నాళ్ల నుంచి మహిళా ప్రాధాన్య సినిమాల్లో నటించసాగింది. లాస్టియర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఒక్కో మూవీ చేస్తున్నది. ఈ రెండు భిన్నమైన సినిమాలే. అయితే కొన్నాళ్ల కిందట తెలుగులో ఓ ఆఫర్ వచ్చిందట! ఓ స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో అవకాశం వస్తే నో చెప్పిందట! అయిదు కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఒప్పుకోలేదట! అందుకు కారణం అందులో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమేనట! దీన్ని బట్టి సెలెక్టడ్ మూవీస్‌లోనే నటించాలని అనుష్క డిసైడయ్యి ఉన్నట్టుగా ఉంది!