అనుష్క షెట్టి(Anushka Shetty). చాన్నాళ్ల పాటు టాలీవుడ్‌ను శాసించారు. అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఆరంభంలో గ్లామర్‌ పాత్రకే పరిమితమైన అనుష్కకు అరుంధతి(Arundhathi) సినిమా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమాతో ఆమె సినీ కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. ఎప్పుడైతే సైజ్ జీరో(size zero) సినిమా చేశారో అప్పట్నుంచి ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది.

అనుష్క షెట్టి(Anushka Shetty). చాన్నాళ్ల పాటు టాలీవుడ్‌ను శాసించారు. అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఆరంభంలో గ్లామర్‌ పాత్రకే పరిమితమైన అనుష్కకు అరుంధతి(Arundhathi) సినిమా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమాతో ఆమె సినీ కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. ఎప్పుడైతే సైజ్ జీరో(size zero) సినిమా చేశారో అప్పట్నుంచి ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది. ఆసినిమా కోసం బరువు పెరిగిన అనుష్క మళ్లీ తన పూర్వాకృతిని సంతరించుకోలేకపోయారు. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అనుష్క ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కొన్ని సినిమాలు చేశారు కానీ అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. అనుష్క బయట కనిపించి చాలా కాలం అయ్యింది. మీడియాలో కనిపించి కూడా చాన్నాళ్లయ్యింది. సోషల్‌ మీడియాలో కూడా అనుష్క యాక్టివ్‌గా ఉండరు. లేటెస్ట్‌గా ఆమె బయటకు వచ్చారు. ఆమెను చూసి అభిమానులు షాక్‌ అయ్యారు. లాస్టియర్‌ ఆమె నటించిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా విడుదలయ్యింది. అప్పుడు కూడా అనుష్క బయటకు రాలేదు. ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. బరువు తగ్గకపోవడమే అందుకు కారణం. ఆ భయంతోనే ఆమె బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం అనుష్క చాలా సన్నబడ్డారు. లేటెస్ట్‌గా ఆమె ఓ మలయాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సినిమాకు సంబంధించిన తాజా ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో అనుష్క చూడచక్కగా ఉన్నారు. మునపటి అనుష్కను చూడగలుగుతున్నామని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. మళ్లీ ఆమె కెరీర్‌ గాడినపడుతుందేమో! సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతారేమో! చూడాలి.

Updated On 12 March 2024 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story