అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి(Anushka Shetty) అంటే తెలియని తెలుగువారు ఉండరు. దాదాపు 18 ఏళ్లుగా సినీ రంగంలో అగ్ర కథానాయికగా వెలుగుతూ వస్తున్నారు అనుష్క. ఇప్పటికీ ఆమె గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు. క్రేజ్ కూడా అలాగే ఉంది. లేటెస్ట్‌గా నవీన్ పొలిశెట్టితో(Naveen Polishetty) కలిసి అనుష్క నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి(Miss shetty mister polishetty) సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కాబోతున్నది.
అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి(Anushka Shetty) అంటే తెలియని తెలుగువారు ఉండరు. దాదాపు 18 ఏళ్లుగా సినీ రంగంలో అగ్ర కథానాయికగా వెలుగుతూ వస్తున్నారు అనుష్క. ఇప్పటికీ ఆమె గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు. క్రేజ్ కూడా అలాగే ఉంది. లేటెస్ట్‌గా నవీన్ పొలిశెట్టితో(Naveen Polishetty) కలిసి అనుష్క నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి(Miss shetty mister polishetty) సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కాబోతున్నది. తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశానని, నిర్మాణ సమయంలో ఏ సినిమా ఇవ్వని అనుభూతి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా ఇచ్చిందని అనుష్క అన్నారు. నిజంగానే తనకు ఇది స్వీట్ జర్నీ అని, దర్శకుడు మహేశ్(Mahesh) అందరికీ నచ్చే కథను తయారు చేసుకున్నాడని, ఎవరికైనా కనెక్టయ్యే పాయింట్ ఇదని అనుష్క అన్నారు. నవీన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, పని విషయంలో చాలా సిన్సియర్ అని చెబుతూ నవీన్‌లో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని, తన హ్యూమర్‌తో సాటి ఆర్టిస్టులకు కష్టం తెలియకుండా మాయ చేస్తాడని తెలిపారు. ఆర్టిస్టుగా నవీన్ కంటే తాను సీనియర్నే కావొచ్చు.
కానీ ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ అనిపించదని, తామిద్దరి మధ్య కెమిస్ట్రీ అలా వర్కవుటయిందని చెప్పారు. 'అన్విత, సిద్ధూ అనే ఇద్దరి ప్రయాణం ఈ సినిమా. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇది. అసలు ప్రెగ్నెన్సీకి పెళ్లికి ఏమిటి సంబంధం? ఇద్దరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికి పెళ్లి అవసరమా? అమ్మ అవ్వాలంటే పెళ్లి కంపల్సరా? అని ప్రశ్నించే విప్లవభావాలు కలిగిన అమ్మాయి అన్విత. అలాంటి అమ్మాయికి సిద్ధూ అనే అబ్బాయికి మధ్య సాగే సరదా కథనం ఇది.మహేశ్ ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటాడు' అని స్వీటి తెలిపారు.
ఈ సినిమా తర్వాత ‘కథనార్’ అనే మలయాళం సినిమా చేయబోతున్నానని, ర్శకుడు రోజిన్ థామస్ ఏడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో తన పాత్రను రివీల్ చేయదలుచుకోలేదని, చాలామంది ఘోస్ట్‌గా చేస్తున్నానుకుంటున్నారని, అందులో నిజంలేదని అన్నారు.ఇక తెలుగు విషయానికొస్తే.. ప్రస్తుతం కథలు వినే పనిలోవున్నానని, బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ ఒక వెర్షన్ విన్నానని, మళ్లీ వినాలని అనుష్క తెలిపారు.