టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli)- బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరు తమ రెండో బిడ్డ గురించి చెబుతారేమోనని చాలా రోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు.

Anushka Sharma Second Pregnancy
టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli)- బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరు తమ రెండో బిడ్డ గురించి చెబుతారేమోనని చాలా రోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు. లేటెస్ట్‌గా అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లితో కలిసి ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు చిక్కారు. వీడియోలో అనుష్క శర్మ తన బేబీ బంప్‌పై(Baby Bump) చేతులు పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. ఇందులో ఆమె బేబీ బంప్ చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ విరాట్-అనుష్క ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.
అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఈ జంట ముంబాయిలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు వెళ్లారు కూడా ! ఎందుకు ఆ క్లినిక్‌కు వెళ్లామనే విషయంపై త్వరలోనే వెల్లడిస్తామని చెప్పిన విరాట్- అనుష్కలు దయచేసి ఎవరూ ఫోటోలు తీయవద్దని మీడియాను వేడుకున్నాడు. అప్పట్నుంచే అనుష్క ప్రెగ్నెంట్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. లేటెస్ట్‌గా అనుష్కకు సంబంధించిన వీడియోలో బేబీ బంప్ చాలా స్పష్టంగా కనిపించడంతో ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అని అర్థమవుతోంది. వన్డే వరల్డ్ కప్(Worldcup) పూర్తి అయిన తర్వాత ఈ విషయంపై విరాట్- అనుష్క దంపతులు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. వీరిద్దరికి 2021లో వామిక జన్మించిన విషయం తెలిసిందే.
