ఓ స్టేజికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫ్యామిలీనే ఇంపార్టెంట్! అందుకే ఇంగ్లీషు క్రికెటర్లు చాలా మంది 30 ఏళ్లు నిండగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma) కూడా అదే పని చేయబోతున్నారు. కుటుంబంపై దృష్టి పెట్టడానికి ఇకపై ఏడాదికి ఒక్క సినిమాలోనే నటించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఓ స్టేజికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫ్యామిలీనే ఇంపార్టెంట్! అందుకే ఇంగ్లీషు క్రికెటర్లు చాలా మంది 30 ఏళ్లు నిండగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma) కూడా అదే పని చేయబోతున్నారు. కుటుంబంపై దృష్టి పెట్టడానికి ఇకపై ఏడాదికి ఒక్క సినిమాలోనే నటించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత చక్దా ఎక్స్‌ప్రెస్(Chakda Express) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అనుష్క శర్మ. మహిళా దిగ్గజ క్రికెటర్ జులన్ గోస్వామి(Julan Goswami) జీవితం ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ చిత్రమిది! దీనికి ప్రోసిత్ రాయ్(Prosit Roy) దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఏడాదికి ఒకే సినిమా చేయాలన్న తన నిర్ణయం ఫ్యాన్స్‌కు నచ్చపోవచ్చు కానీ, తప్పనిసరి పరిస్థితులలో ఇలా చేయాల్సి వస్తున్నది అని అనుష్క చెప్పారు.
' నా కూతురు వామికకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ వయసులో పాప ఆలనాపాలనా నేను చూడాలి. విరాట్ కోహ్లీ గొప్ప తండ్రి. ఆయన బాధ్యతను ఆయన చక్కగా నిర్వర్తిస్తాడు. కాకపోతే ఈ సమయంలో తల్లిగా నేనే పాపకు ఎక్కువ సన్నిహితంగా ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నటనను నేను బాగా ఆస్వాదిస్తా. ఇక నుంచి ఎక్కువ సినిమాలు చేయడం సాధ్యం కాదు. ఫ్యామిలీకి ఎక్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నా' అని అనుష్క శర్మ తెలిపారు. నటిగా, భార్యగా, తల్లిగా, సెలెబ్రిటీగా.. తన సంతోషానికి కారణమైన ప్రతి పాత్రను ఆస్వాదించానని, ఇందులో ఏది ముఖ్యమైంది అని చెప్పలేనని, అయితే ఎప్పుడు ఎందులో సంతృప్తి కలిగితే అదే చేస్తానని అనుష్క శర్మ వివరించారు.