చిన్న చిన్న అపార్థాలే అనర్థాలకు దారి తీస్తాయి. నటుడు విక్రమ్‌(Vikram), బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌(Anurag Kashyap) విషయంలో ఇదే జరిగింది. కెన్నడీ సినిమా విషయంలో తనను ఉద్దేశిస్తూ అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై విక్రమ్‌ స్పందించారు. అనురాగ్‌ తన కోసం కథను సిద్ధం చేశారని తెలిసిన మరుక్షణమే తాను ఆయనను సంప్రదించినట్టు విక్రమ్‌ తెలిపారు.

చిన్న చిన్న అపార్థాలే అనర్థాలకు దారి తీస్తాయి. నటుడు విక్రమ్‌(Vikram), బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌(Anurag Kashyap) విషయంలో ఇదే జరిగింది. కెన్నడీ సినిమా విషయంలో తనను ఉద్దేశిస్తూ అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై విక్రమ్‌ స్పందించారు. అనురాగ్‌ తన కోసం కథను సిద్ధం చేశారని తెలిసిన మరుక్షణమే తాను ఆయనను సంప్రదించినట్టు విక్రమ్‌ తెలిపారు. ఏడాది కిందట తమ మధ్య జరిగిన సంభాషణల సారాంశాన్ని ట్వీట్‌ చేశారు విక్రమ్‌. 'డియర్‌ అనురాగ్‌ కశ్యప్‌. సోషల్‌ మీడియాలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఏడాది కిందట మన మధ్య జరిగిన సంభాషణను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను.

ఈ సినిమా కోసం ఈ మెయిల్‌, మెస్సేజ్‌ల ద్వారా నన్ను సంప్రదించినప్పటికీ నా నుంచి మీకు ఎలాంటి సమాధానం రాలేదని మీరే ఓ నటుడితో చెప్పారు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు ఫోన్‌ చేశాను. మీరు ఏ మెయిల్ ఐడీకి అయితే సందేశాలు పంపించారో అది యాక్టివ్‌గా లేదని, నా మొబైల్‌ నంబర్‌ కూడా రెండేళ్ల కిందటే మార్చేశానని, అందుకే నన్న రీచ్‌ కాలేకపోయారని అప్పుడే మీకు చెప్పాను. అలాగే, కెన్నెడీ నాకెంతో నచ్చిందని కూడా చెప్పాను కదా’ అని విక్రమ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు అనురాగ్‌ కశ్యప్‌ రియాక్టయ్యారు. 'నిజమే బాస్‌. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్‌ నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు కూడా తెలిసింది విక్రమ్‌కు వేరే ఫోన్‌ నంబర్‌ ఉందని. అధికారిక మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలను మాకు ఇచ్చారు.

అలాగే, విక్రమ్‌ నా స్క్రిప్ట్‌ చదవడానికి ఆసక్తి కనబరిచారు. కాకపోతే అప్పటికే మేము షూటింగ్‌ కోసం షెడ్యూల్‌ సిద్ధం చేసేసుకున్నాం. మా చిత్రానికి కెన్నెడీ అనే టైటిల్‌ పెట్టుకోవడానికి ఆయన పూర్తిగా అంగీకారం తెలిపారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కెన్నెడీ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. ఆయనతో కలిసి పనిచేయకుండా రిటైర్‌ అయితే కాను’’ అని అనురాగ్‌ కశ్యప్‌ రీ ట్వీట్ చేశారు. రాహుల్‌ భట్‌(Rahul bhatt), సన్నీలియోనీ(sunny leone) హీరో హీరోయిన్లుగా నటించిన కెన్నెడీ(Kennedy) చిత్రానికి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ప్రదర్శన కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జరిగింది. అందులో భాగంగా అనురాగ్‌ మాట్లాడుతూ .. విక్రమ్‌ను దృష్టిలో పెట్టుకునే తాను ఈ కథను రాసుకున్నానని, ఆయనను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదని, అందుకే రాహుల్‌తో ఈ సినిమా చేశానని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట్‌ చక్కర్లు కొట్టాయి. అందుకే విక్రమ్‌ రియాక్టవ్వాల్సి వచ్చింది.

Updated On 23 May 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story