కొన్నిసార్లు జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. బాలీవుడ్ సినిమా కథలాగే ఆసక్తికరంగా మారుతుంది.
కొన్నిసార్లు జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. బాలీవుడ్ సినిమా కథలాగే ఆసక్తికరంగా మారుతుంది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా(sanjay Gupta) జీవితమూ ఇంతే! ఆయన అనురాధ(anuradha) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరూ హాయిగా కాపురం చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ ఫైన్ డే విడాకులు(Divorce) తీసుకుంటున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. విడాకులు పుచ్చుకున్నారు. వేర్వేరుగా ఉండటం మొదలుపెట్టారు. కానీ ఇద్దరిలోనూ ఓ రకమైన విరహపు బాధ. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఎడబాటును ఎంతో కాలం భరించలేకపోయారు. ఆరేళ్లు ఎలాగోలా భరించారు. ఇక తమ వల్ల కాదనుకుని మళ్లీ పెళ్లిచేసుకున్నారు. వీరి పెళ్లి వార్త అప్పట్లో సంచలనం రేపింది. లేటెస్ట్‌గా అనురాధ భర్తతో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అసలు తాము విడిపోవడానికి సంజయ్ ఒక్కడే కారణం కాదని, తన తప్పిదం కూడా ఉందని అనురాధ అన్నారు. ఒకానొక సమయంలో సంజయ్‌తో కలిసి ఉండటం తన వల్ల కాదని అనిపించింది. వెంటనే విడాకులు తీసుకున్నాం. అప్పట్లో సంజయ్‌కు బోల్డన్ని వివాహేతర సంబంధాలు ఉన్నాయనే పుకార్లుపుట్టుకొచ్చాయని, వాటిని తాను నమ్మలేదని, అందరికంటే ఎక్కువగా సంజయ్‌నే నమ్మానని అనురాధ తెలిపారు. విడాకులు తీసుకున్నా సంజయ్ మాత్రం తనతో, తన కుటుంబంతో టచ్‌లోనే ఉన్నాడని అనురాధ తెలిపారు. సంజయ్ అంటే తన కుటుంబానికి ఎంతో ఇష్టమని, విడాకుల తర్వాత తన బంగ్లాలో ఏదో ఒక పార్టీని నిర్వహించేవాడని, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి తాను కూడా పార్టీలకు హాజరయ్యేదానినని తెలిపారు. ఫ్రెండ్స్‌తో కాసేపు చిల్ అయి వెళ్లిపోయేదాన్నని చెప్పుకొచ్చారు. 'ప్రతి ఆరు నెలలకోసారి మళ్లీ కలిసిపోదామా అని అడిగేవాడు. అలా చివరకు మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని అనురాధ అన్నారు. కాగా ఇటీవలే అనురాధ మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటం అందుకుంది.