కేరళ భామ అనుపమ పరమేశ్వరన్‌కు(Anupama Parameshwaran) తెలుగునాట విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె క్లాస్ లుక్స్‌కు, పద్దతిగా ఉండే పాత్రలకు ఫిదా అయ్యారు. ఎప్పుడైతే రౌడీ బాయ్స్(Rowdy boys) సినిమాలో ముద్దు సీన్‌ను ఒప్పుకున్నారో అప్పట్నుంచి కొందరి అభిమానుల మనసు గాయపడింది.
ఇక రీసెంట్గా డీజే టిల్లు 2(Tillu square) ట్రైలర్ విడుదలయ్యాక అందరూ ఆశ్చర్యపోయారు. అనుపమ పరమేశ్వరేనా ఈ పాత్రను వేసింది అన్న అనుమానం వచ్చేసింది. హీరో సిద్ధుతో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. ఆమె లుక్స్ కూడా అన్నీ హాట్‌హాట్‌గానే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అందాలను ఆరబోసింది.
ఇలా గ్లామర్‌ను పారించడానికి రెమ్యునరేషన్‌కు కూడా ఎక్కువే పుచ్చుకున్నదట! మలయాళంలో వచ్చిన ప్రేమమ్(Premam) అనుపమకు మొదటి సినిమా. ఆ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావడంతో ఆమె కొద్దికాలానికే స్టార్ హీరోయిన్ అయ్యింది.
అఆ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది.ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్నింటిలోనూ చక్కగా కనిపించింది. రౌడీ బాయ్స్ సినిమాకు వచ్చేసరికి గీసుకున్న గీతలన్నింటిని చెరిపేసుకుంది. హీరో ఆశిష్‌తో(Ashissh) ముద్దు సన్నివేశాలు చేసింది.
ఆ తర్వాత వచ్చిన కార్తికేయ 2, 18 పేజిస్ సినిమాల్లో మళ్లీ పద్దతిగానే కనిపించింది. ఇప్పుడు డీజే టిల్లు 2 పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించింది. లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి కోటిన్నర రూపాయల వరకు తీసుకున్న అనుమప టిల్లు స్వ్కేర్ సినిమాకు మాత్రం రెండు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్నదట!
అంతగా గ్లామర్ షో చేసినందుకు ఆ మాత్రం ఇవ్వాల్సిందేలే అని అందరూ అనుకుంటున్నారు. సినిమా హిట్టయితే మాత్రం ఇదే రెమ్యునిరేషన్కు ఫిక్స్ అవ్వాలని డిసైడయ్యిందట!