అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. మలయాళీ హీరోయిన్(Malayalee Beautie) అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. కుర్రకారు ఈమంటే పడి చచ్చిపోతారు. చాలా మంది ఫోన్‌లో, వాట్సప్ డీపీల్లో అనుపమ ఫోటోనే పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాంటి ఆరాధకులకు షాకిచ్చారు అనుపమ. షాకివ్వడమేమిటి ?

Anupama Parameswaran
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. మలయాళీ హీరోయిన్(Malayalee Beautie) అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. కుర్రకారు ఈమంటే పడి చచ్చిపోతారు. చాలా మంది ఫోన్‌లో, వాట్సప్ డీపీల్లో అనుపమ ఫోటోనే పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాంటి ఆరాధకులకు షాకిచ్చారు అనుపమ. షాకివ్వడమేమిటి ? ఏకంగా గుండెల్లో బాంబులే పేల్చారు. తన ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ముక్క చదివి చాలా మంది తెగ ఫీలయ్యారు. మొత్తం చదివిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని చెబుతూ, అది నిజమైన నిశ్చితార్థం కాదని, ఉట్టిదేనని చెప్పారు. ఓ ప్లాస్టిక్ కవర్‌ను చేతికి ఉంగరంలా చుట్టుకున్న అనుపమ ఆ ఫోటోను షేర్ చేసి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని సరదాగా రాసుకొచ్చారు. థాంక్ గాడ్.. ఇది నిజమైతే తామంతా ఏమవ్వాలి అనుపమ అని హీరోయిన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఆమె సినీ కెరీర్ మొదలయ్యింది. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. తెలుగులో త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్‌లో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగులో రీమేక్ చేసిన ప్రేమమ్‌లో కూడా అనుపమనే నటించారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. ప్రస్తుతం తమిళంలో సైరన్, మలయాళంలో జేఎస్‌కే ట్రూత్ షెల్ ఆల్వేస్ ప్రీవేల్, తెలుగులో టిల్లు స్క్వేర్, ఈగల్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
