సోషల్ మీడియా(Social Media)లో వచ్చే కథనాల్లో 90 శాతం వండివార్చినవే ఉంటాయి. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో ఓ పట్టాన అర్థం కాదు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనానికి ఆసక్తి ఉంటుందని తెలుసుకునే మసాలా కథలను తయారుచేస్తున్నారు కొందరు. వారు సినిమావాళ్లయితే ఏఏ సినిమాలు చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు?

Anupama Parameswaran Ram Pothineni Marriage
సోషల్ మీడియా(Social Media)లో వచ్చే కథనాల్లో 90 శాతం వండివార్చినవే ఉంటాయి. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో ఓ పట్టాన అర్థం కాదు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనానికి ఆసక్తి ఉంటుందని తెలుసుకునే మసాలా కథలను తయారుచేస్తున్నారు కొందరు. వారు సినిమావాళ్లయితే ఏఏ సినిమాలు చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు? ప్రేమ వరకేనా? పెళ్లి కూడా చేసుకుంటారా? ఇత్యాది వివరాలన్నీ ఆరా తీసి తమకు నచ్చిన విధంగా స్టోరీ రాస్తున్నారు. ఇలాంటి ఓ వదంతి ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మలయాళ అందాల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను అమితంగా ఆరాధించే తెలుగువారు చాలా మందే ఉన్నారు. ఈమె ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ప్రేమలో పడ్డారట! త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట! ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇలాంటి రూమర్స్‌ను అనుపమ పెద్దగా పట్టించుకోరు. పెద్దగా రియాక్టవ్వరు. కాకపోతే ఈ వదంతులు విని విని అనుపమ తల్లికి విసుగు పుట్టేసిందట! నా కూతురుపై అవాస్తవాలు రాస్తారా అంటూ మండిపడిన ఆమె, హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని తేల్చేసింది. ఇది అనుపమ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించింది. రామ్‌తో కలిసి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) చేసింది రెండే రెండు సినిమాలు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే అనే సినిమాల్లో రామ్, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం అనుపమ చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. రవితేజ హీరోగా వస్తున్న ఈగిల్, సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న డీజే టిల్లు స్కైర్‌లలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తబిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.
