తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran. 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఆమె సినీ కెరీర్ మొదలయ్యింది. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. ఆ తరువాత కొడి చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇక్కడా కొన్ని చిత్రాల్లోనే నటించింది. తెలుగులో త్రివిక్రమ్‌డైరెక్షన్‌లో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran. 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఆమె సినీ కెరీర్ మొదలయ్యింది. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. ఆ తరువాత కొడి చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇక్కడా కొన్ని చిత్రాల్లోనే నటించింది. తెలుగులో త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్‌లో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగులో రీమేక్ చేసిన ప్రేమమ్‌లో కూడా అనుపమనే నటించారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. ప్రస్తుతం తమిళంలో జయం రవితో కలిసి సైరన్(siren), మలయాళంలో జేఎస్‌కే ట్రూత్ షెల్ ఆల్వేస్ ప్రీవేల్, తెలుగులో టిల్లు స్క్వేర్, ఈగల్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. మనసుకు కష్టమైన విషయాలను, బాధించే సంఘటనలను సాధ్యమైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తానని ఇటీవల ఓ భేటీలో తెలిపారు అనుపమ. తాను చాలా పాజిటివ్ పర్సన్ అని చెప్పారు. తనకు ఏదైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తానని, తర్వాత దాని గురించి మర్చిపోతానని అనుపమ పేర్కొన్నారు. జీవితం చాలా చిన్నదని, ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉంటామో తెలియదని, వెళ్లే సమయం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని వేదాంతం చెప్పారు. అందుకే జీవితంలో ఎదురైన అవరోధాలను, సమస్యలను మనసులోనే పెట్టుకుని మధనపడకూడదని, మనలోని శక్తిని వృథా చేసుకోకూడదని హితవు చెప్పారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలు నెల రోజుల తరువాత ఎలాగైతే ఆటోమాటిక్‌గా డిలైట్ అయిపోతాయో మన మనసును కూడా అలా ఉంచుకోవాలంటూ తత్వబోధ చేశారు అనుపమ పరమేశ్వరన్.