చాలా సినిమాలలో హోమ్లీ పాత్రల్లో నటించిన అనుపమ.. ఒక్కసారిగా హాట్ అవతార్ లో కనిపించడంతో

ఇటీవల విడుదలైన 'టిల్లూ స్క్వేర్' ట్రైలర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సిద్ధు జొన్నలగడ్డ కామిక్ టైమింగ్, అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. ట్రైలర్‌లో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. పోస్టర్ల నుండి ట్రైలర్ వరకు, అనుపమ గ్లామరస్ లుక్స్ గురించి బాగా చర్చిస్తూ ఉన్నారు. ట్రైలర్‌లో లిప్ లాక్ సీన్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్రం ముఖ్యంగా యూత్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే సీక్వెల్ హైప్‌తో మంచి బజ్‌ను సృష్టించగలిగింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్‌ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

చాలా సినిమాలలో హోమ్లీ పాత్రల్లో నటించిన అనుపమ.. ఒక్కసారిగా హాట్ అవతార్ లో కనిపించడంతో ఆమెను ఇన్నాళ్లూ ఆరాధించిన అభిమానులు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. కార్ లో లిప్ లాక్ సీన్ గురించి బాధను వ్యక్తం చేశారు అనుపమ ఫ్యాన్స్. ఏది ఏమైనా ఈ సినిమాలో కొత్త అనుపమ పరమేశ్వరన్ ను చూస్తామన్నది మాత్రం నిజమనే చెప్పొచ్చు. అద్భుతం, నరుడా డోనరుడా చిత్రాలకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల స్వరాలు సమకూర్చారు. సాంగ్స్ ఇప్పటికే బాగా హిట్ అయ్యాయి

Updated On 15 Feb 2024 10:58 PM GMT
Yagnik

Yagnik

Next Story