పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) అనుకున్నది సాధించాడు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) అనుకున్నది సాధించాడు. జనసేనాని అయిన పవన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు కాస్త సమయం దొరకడంతో ఆ సినిమాలకు కదలిక వచ్చింది. ప్రస్తుతం పవన్‌ మూడు సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హరిహర వీరమల్లు ఒకటి. మూడేళ్ల కిందట ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచి ఆగపోతూ ముందుకు కదులుతూ నత్తనడకన సాగుతోంది ఈ సినిమా షూటింగ్‌. క్రిష్‌(Krish) దర్శకత్వంలో సినిమా స్టార్టయ్యింది. అనివార్య కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ ప్లేస్‌లో జ్యోతికృష్ణ(Jyothi krishna) వచ్చాడు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ వారియర్‌గా నటిస్తున్నాడు. 17వ శతాబ్దానికి చెందిన కథ కాబట్టి ఆ కాలం నాటి వాతావరణం ప్రతిబింబించేలా సెట్టింగ్స్‌ వేస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. గ‌త‌కొంత‌కాలంగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులంతా ఎంతో నిరాశ‌లో ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్(Bollyood) న‌టుడు అనుప‌మ్ ఖేర్‌(Anupam Kher) న‌టిస్తున్న‌ట్లు మూవీ మేకర్స్‌ తెలిపారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తాయ‌ని అంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు హరిహర వీరమల్లును నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.Anupam Kher : హరిహరవీరమల్లులో బాలీవుడ్‌ స్టార్‌!

Eha Tv

Eha Tv

Next Story