అయిదేళ్ల కిందట కేరళలో(Kerala) సంభవించిన పెను విలయాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? భయంకరమైన వర్షాలు, తీవ్రమైన వరదలు ఆ రాష్ట్రాన్ని కోలేకోలేనంత దెబ్బ తీశాయి. ఆ వరదల నేపథ్యంలో మలయాళంలో 2018(2018) పేరుతో ఓ సినిమా తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.

2018 Movie Into Oscar
అయిదేళ్ల కిందట కేరళలో(Kerala) సంభవించిన పెను విలయాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? భయంకరమైన వర్షాలు, తీవ్రమైన వరదలు ఆ రాష్ట్రాన్ని కోలేకోలేనంత దెబ్బ తీశాయి. ఆ వరదల నేపథ్యంలో మలయాళంలో 2018(2018) పేరుతో ఓ సినిమా తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు(Oscar) రేసులో నలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Film Federation Of India) ప్రకటించింది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఆంథోని జోసెఫ్(Anthony Joseph) దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్(Tovino Thomas), ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి(Aparna Balamurali), వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాను 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి.
