విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) హీరోగా వస్తున్న సినిమా సైంధవ్‌(Saindhav). టైటిల్‌తోనే అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకున్న ఈ సినిమాకు శైలేష్‌ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్‌ బోయనపల్లి(Venkatesh Boyanapally) నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ(Nawazuddin Siddiqui) నటిస్తున్నాడని తెలిసింది. తెలుగులో ఆయన నటించడం ఇదే మొదలు.

విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) హీరోగా వస్తున్న సినిమా సైంధవ్‌(Saindhav). టైటిల్‌తోనే అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకున్న ఈ సినిమాకు శైలేష్‌ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్‌ బోయనపల్లి(Venkatesh Boyanapally) నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ(Nawazuddin Siddiqui) నటిస్తున్నాడని తెలిసింది. తెలుగులో ఆయన నటించడం ఇదే మొదలు. మే 19వ తేదీ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న చిత్ర యూనిట్‌ ఆయనకు బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. ఈ సినిమాలో ఆయన ధరిస్తున్న పాత్ర వికాస్‌ వలిక్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో నవాజుద్దీన్‌ పవర్‌ఫుల్‌ విలన్‌ రోల్‌ను పోషిస్తున్నారు. హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ సినిమా. హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. డాక్టర్‌ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు. సైంధవ్‌ సినిమా ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ అవుతుంది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్‌ అనుకుంటోంది. సంతోష్‌ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

Updated On 20 May 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story