టాలీవుడ్‌పై గతంలో ఇతర భాషలకు చెందిన నటీమణులు విమర్శలు చేశారు. ఆ విమర్శలలో నిజానిజాలేమిటో తెలుసుకోకుండానే వారిని తిట్టిపోశారు. అక్కడికేదో మన టాలీవుడ్‌లో అందరూ సుద్దపూసలే అయినట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నాం. లేటెస్ట్‌గా బాలీవుడ్ బ్యూటీ అంకిత లోఖండే(Ankita Lokhande) కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమపై(South industry) ఆరోపణలు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు.

Ankita Lokhande
టాలీవుడ్‌పై గతంలో ఇతర భాషలకు చెందిన నటీమణులు విమర్శలు చేశారు. ఆ విమర్శలలో నిజానిజాలేమిటో తెలుసుకోకుండానే వారిని తిట్టిపోశారు. అక్కడికేదో మన టాలీవుడ్‌లో అందరూ సుద్దపూసలే అయినట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నాం. లేటెస్ట్‌గా బాలీవుడ్ బ్యూటీ అంకిత లోఖండే(Ankita Lokhande) కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమపై(south film industry) ఆరోపణలు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. 'సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు నాకు ఫోన్ చేసి మీరు సెలెక్టయ్యరు, వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం చేసి వెళ్లండి అని చెప్పారు. నేను సంతోషంతో ఎగిరి గంతేశాను. విషయం అమ్మకు చెప్పడంతో ఆమె కూడా ఆనందపడ్డారు. అయితే ఇంత తేలికగా ఎలా సెలెక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తి బయటే ఉండమన్నాడు. లోపలికి వెళ్లిన తర్వాత కాంప్రమైజ్ కావాలని అడిగారు. నేను షాకయ్యాను. నాకు అప్పుడు 19 ఏళ్లు. హీరోయిన్ చేస్తారని అనుకుంటే ఈ కాంప్రమైజ్ ఏమిటి అని అడిగాను. అందుకు వాళ్లు నిర్మాతతో ఓ రాత్రి గడపాలని చెప్పారు. అప్పుడు నేను గట్టిగా క్లాస్ తీసుకున్నాను. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటాను. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని అంకిత లోఖండే ఆ నాటి అనుభవాన్ని అందరితో చెప్పుకున్నారు. అయితే దక్షిణాది సినీ పరిశ్రమలో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఎదురైందో వివరంగా చెప్పలేదామె!
