బిగ్‌బాస్(Bigg Boss) గురించి తెలియనివారుండరు. తెలుగుతో పాటు పలు భాషల్లో బిగ్‌బాస్ షో జరుగుతోంది. అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బిగ్‌బాస్‌లో నామినేషన్లు, గేమ్స్‌తో కంటెస్టెంట్‌లు అలరిస్తారు. ఎన్నో సార్లు అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు చూస్తుంటం. ప్లాన్ ప్రకారమే ఈ ఘర్షణ వాతావరణం నెలకొల్పుతారన్న నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 17వ(Bigg Boss 17) సీజన్ నడుస్తోంది. హిందీలోనూ బిగ్‌బాస్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోందట. తెలుగులో బిగ్‌బాస్ షోన్ హీరో నాగార్జున(Nagarjuna) హోస్ట్ చేస్తుంటే.. హిందీలో సల్మాన్(Salmaan) ఆధ్వర్యంలో షో నడుస్తోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ(Pregnancy) వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ 17లో అంకితా లోఖండే(Ankitha Lokhande), విక్కీ జైన్(Vickey Jain) అనే జంట పాల్గొంటోంది. అయితే అంకిత తనకు అనారోగ్యంగా ఉందని, తనకు ఏదో జరిగినట్లు అనిపిస్తోందని భర్త విక్కీతో చెప్తుంది. తనకు పీరియడ్స్ రాలేదని, పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ఇంటికి వెళ్లాలని అనిపిస్తోందని చెప్పింది. తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారని, యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని భర్తకు తెలిపింది. టెస్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాని అంఖితా లోఖండే వివరించింది. ఈ షోలో పలుసార్లు అంకిత, విక్కీ మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్‌లో ప్రెగ్నెన్సీ కూడా సాధ్యమా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.