ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara)! చాలా గ్యాప్‌ రావడంతో అభిమానులు దేవర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్‌ మాత్రమే రిలీజ్‌ అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా దేవర సినిమా టీజర్‌(Teaser) త్వరలో రాబోతుందని సోషల్‌ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara)! చాలా గ్యాప్‌ రావడంతో అభిమానులు దేవర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్‌ మాత్రమే రిలీజ్‌ అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా దేవర సినిమా టీజర్‌(Teaser) త్వరలో రాబోతుందని సోషల్‌ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి. టీజర్‌ రెడీగా ఉందని సంగీత దర్శకుడు అనిరుధ్‌(Anirudh Ravi Chandran) ఇచ్చిన హింట్‌ అభిమానుల్లో జోష్‌ను పెంచింది. దేవర సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకు అనిరుధ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాడని ప్రకటించగానే ఎన్టీఆర్‌(NTR) ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా హిట్టు కొట్టడమే ఆ ఉత్సాహానికి కారణం.
దేవర టీజర్‌కు సంబంధించి అనిరుధ్‌ మంగళవారం సాయంత్రం ఎక్స్‌లో(Twitter) ఒక పోస్ట్‌ పెట్టాడు. దేవర టీజర్‌ అని రాసి పక్కనే చప్పట్లు కొడుతున్న ఎమోజీలు పెట్టాడు. ఎన్టీఆర్‌, కొరటాల శివ ఆన్‌ ఫైర్‌ అన్నట్టుగా ఫైర్‌ ఎమోజీలు ఉంచారు. ఎగ్జయిటెడ్‌ అని సంగీతాన్ని సూచించే ఎమోజీలు పెట్టాడు. అంటే టీజర్‌కి అనిరుధ్ మ్యూజిక్‌ ఇచ్చేశాడన్నమాట! అంతేకాదు, అనిరుధ్ పెట్టిన ఒక హ్యా్ష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #AllHailTheTiger అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు అనిరుధ్. అంటే, పులికి అందరూ సలాం కొడతారు అని అర్థమన్నమాట! ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయ. రెండు భాగాలుగా రానున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్ పార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదన విడుదల కానుంది.

Updated On 27 Dec 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story