యానిమల్ చిత్ర బృందం ఎట్టకేలకు OTT స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా థియేటర్లలో భారీ హిట్ గా నిలిచింది.

యానిమల్ చిత్ర బృందం ఎట్టకేలకు OTT స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా థియేటర్లలో భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా OTT లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఓటీటీ విడుదల చుట్టూ భారీ బజ్ ఉంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అధికారిక అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు యానిమల్ టీమ్ OTT స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ధృవీకరించింది. చిత్రం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో, యానిమల్ సినిమా రిపబ్లిక్ డే నుండి ప్రసారం అవుతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.

‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల‌ను సృష్టించింది. మొద‌టిరోజు నుంచే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ప‌రుగులు పెట్టిస్తుంది. మొద‌టిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వ‌సూలు చేయ‌గా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వ‌సూలు చేసింది. ఇక మూడో రోజు వ‌రల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. యానిమల్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 900కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. OTT వెర్షన్‌లో రష్మిక మందన్నకు సంబంధించి అదనపు సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.

Updated On 23 Jan 2024 8:48 PM GMT
Yagnik

Yagnik

Next Story