బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) గురించి తెలియని యూత్‌ ఉండదు. యానిమల్(Animal) సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్‌ అయిపోయారు. సోషల్‌ మీడియాలో(social media) ఆమెకు ఫాలోయర్స్‌ విపరీతంగా పెరిగారు. యానిమల్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న తర్వాత ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాపై విమర్శలు ఎన్ని ఉన్నా అది కలెక్షన్లను కుమ్మేసింది.

బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) గురించి తెలియని యూత్‌ ఉండదు. యానిమల్(Animal) సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్‌ అయిపోయారు. సోషల్‌ మీడియాలో(social media) ఆమెకు ఫాలోయర్స్‌ విపరీతంగా పెరిగారు. యానిమల్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న తర్వాత ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాపై విమర్శలు ఎన్ని ఉన్నా అది కలెక్షన్లను కుమ్మేసింది. ఆ సినిమాలో త్రిప్తి డిమ్రి జోయా అనే పాత్రను పోషించింది. చిన్న రోలే అయినప్పటికీ చాలాకాలం గుర్తిండే పాత్ర అది! రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir), త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. చాలా మంది ఆమెకు ఫ్యాన్స్‌ అయ్యారు. త్వరలో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో గుప్పుమంది. ఇప్పటికే డేటింగ్‌లో ఉన్న త్రిప్తి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. దీనిపై త్రిప్తిని వివరణ కోరినప్పుడు పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన ఏమీలేదని, ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టానని చెప్పింది. కాకపోతే తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు(Qualities) ఉండాలో చెప్పింది. డబ్బు, పాపులారిటీ లేకున్నా మంచి మనసుంటే చాలని తెలిపింది. యానిమల్ కంటే ముందు త్రిప్తి పలు వెబ్‌ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఓటీటీలను వదలనని త్రిప్తి తెలిపింది. త్రిప్తికి తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్నసూరి రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్‌ సినిమాలో త్రిప్తి నటించబోతున్నది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాలోనూ త్రిప్తికి అవకాశం వచ్చినట్టు చెబుతున్నారు.

Updated On 1 Feb 2024 4:05 AM GMT
Ehatv

Ehatv

Next Story