సందీప్‌రెడ్డి వంగా(Sandeep reddy Vanga) రూపొందించిన యానిమల్(Animal) సినిమా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే అదే సమయంలో ఆ సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చాలా మంది ఆ సినిమాను తిట్టిపోశారు. ఆ విషయం అలా ఉంచితే యానిమల్ సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

సందీప్‌రెడ్డి వంగా(Sandeep reddy Vanga) రూపొందించిన యానిమల్(Animal) సినిమా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే అదే సమయంలో ఆ సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చాలా మంది ఆ సినిమాను తిట్టిపోశారు. ఆ విషయం అలా ఉంచితే యానిమల్ సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఇందులో ఆమె పాత్రపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఆమె నటించిన దృశ్యాలపై నెటిజన్లు ట్రోలింగ్‌ చేశారు. ఇటీవల ఆ పాత్ర గురించి త్రిప్తి మీడియాతో ముచ్చటించారు. 'సందీప్‌రెడ్డి వంగా స్టోరీ చెప్పినప్పుడే నాది చాలా చిత్ర పాత్ర అని స్పష్టత ఇచ్చారని ఆమె తెలిపారు. నాకు మాత్రం ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది చేయలేం. సినిమా రంగంలో పరిధులను పెట్టుకుంటే అనుకున్నది సాధించలేము. మనకు ఎప్పుడూ కంఫర్టబుల్‌ పాత్రలే దొరకవు. అవే చేయాలని నేను కూడా అనుకోను. అందుకే యానిమల్‌లో ఆ పాత్రను ఒప్పుకున్నాను. కానీ అందులో నేను నటించిన శృంగార సన్నివేశాలు(Intimate scenes) చూసి నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. ఆ సన్నివేశం ఆ సినిమాకు ఎంత ముఖ్యమో నేను వారికి వివరించి చెప్పాను. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. ఈ సినిమాతో ప్రజలు నన్ను గుర్తుపట్టడం మొదలు పెట్టారు. ఇందుకు సందీప్‌వంగాకు థాంక్స్‌ చెప్పుకుంటున్నాను' అని త్రిప్తి డిమ్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె మేరే మొహబూబ్‌ మేరే సనమ్‌, విక్కీ విద్యా కా వో వాలా వీడియో వంటి సినిమాలలో నటిస్తున్నారు. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయట! విజయ్‌ దేవరకొండ- గౌతమ్‌ తిన్నసూరి కాంబినేషన్‌లో వస్తున్న స్పై థ్రిల్లర్‌లో త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. అలాగే రవితేజ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. మొత్తంగా ఈమె వరుస సినిమాలతో బిజీ అయ్యారు.

Updated On 2 March 2024 12:58 AM GMT
Ehatv

Ehatv

Next Story