రామాయణం(Ramayanam) గాథను ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అందుకే రామాయణం ఇతివృత్తంగా వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతం అయ్యాయి. ఆదిపురుష్ సంగతి అడక్కండి! ఇప్పుడు మరొకరు రామాయణం ఇతిహాసాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ సినిమాలో రణ్‌విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) అదరగొట్టేశాడు కదా! అలాగే అందులో అబ్రార్‌గా నటించిన బాబీ డియోల్(Bobby deol) కూడా బ్రహ్మండంగా నటించేశాడు కదా! ఆ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది కూడాఔ ఇప్పుడు వారిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
రామాయణం(Ramayanam) గాథను ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అందుకే రామాయణం ఇతివృత్తంగా వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతం అయ్యాయి. ఆదిపురుష్ సంగతి అడక్కండి! ఇప్పుడు మరొకరు రామాయణం ఇతిహాసాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ సినిమాలో రణ్‌విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) అదరగొట్టేశాడు కదా! అలాగే అందులో అబ్రార్‌గా నటించిన బాబీ డియోల్(Bobby deol) కూడా బ్రహ్మండంగా నటించేశాడు కదా! ఆ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది కూడాఔ ఇప్పుడు వారిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీశ్ తివారి(Nitish tiwari) రామాయణ్(Ramayan) అనే సినిమాను మూడు భాగాలుగా నిర్మించబోతున్నాడు. రెండేళ్లుగా నితీశ్ తివారి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో ఇప్పుడు నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు. రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్‌ను, సీత(Sita) పాత్రకు సాయిపల్లవిని(Sai Pallavi) ఎంపిక చేసుకున్నారాయన! హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించబోతున్నారు. అయితే లేటెస్ట్‌గా అందిన సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రను బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించబోతున్నారట! రామాయణ్ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే మాత్రం యానిమల్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.