క్యాస్టింగ్‌ కౌచ్‌(Casting Couch) గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇది ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.

క్యాస్టింగ్‌ కౌచ్‌(Casting Couch) గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇది ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. పలువురు నటులు ఇప్పటికే తాము ఎప్పుడో ఒకప్పుడు, ఎన్నడో ఒకనాడు క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైనట్లు చెప్పడం చూశాం, విన్నాం. ఇందుకు సంబంధించి 'మీ టూ' అనే పెద్ద ఉద్యమమే జరిగింది. అయితే తాజాగా ఇలాంటి అంశమే మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైన వార్తలు ఆడవారు మాత్రమే చెప్పారు. ఇప్పుడు తాజా మగవారు కూడా ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైనట్లు వెల్లడించడం విశేషం. తాజాగా యానిమల్‌(Animal) నటుడు కూడా తాను క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైనట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సిద్ధాంత్‌ కర్నిక్‌(Siddhant Karnick) అనే బాలీవుడ్‌ నటుడు తాజా ఈ షాకింగ్ కామెట్స్‌ చేశాడు. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న నటుడిగా, పలు హిట్‌ సినిమాల్లో తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు సిద్ధాంత్ కర్నిక్. 2023లో సందీప్‌రెడ్డి వంగా(Sandeep reddy vanga) నిర్మించిన 'యానిమల్' సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రభాస్‌(Prabhas) నటించిన ఆదిపురుష్‌(Adipurush) సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు సిద్ధాంత్ కర్నిక్. సిద్ధాంత్ 2004లో టీవీ షో రీమిక్స్ తో తన కెరీర్ ప్రారంభించాడు. ఫేమస్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ '2005 సంవంత్సరంలో ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తున్నాను. ఓ సినిమాలో ఆఫర్‌ కోసం కో-ఆర్డినేటర్‌ను కలిశాను. అతను నా ప్రొఫైల్‌ తీసుకొని రాత్రి 10.30 గంటలకు రావాలని కోరాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఆ సమయంలో ఎందుకు రావాలి అని అనుకున్నాను. కానీ ఆఫర్‌ కోసం తను చెప్పిన సమయానికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత అతని నిజరూపం బయటడపడింది. అవకాశాలు దక్కాలంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి లేదంటే అవకాశాలు రావని అతడు చెప్తూ నా దగ్గరికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతని నుంచి తప్పించుకుని నాకు ఇలాంటివి ఇష్టం లేదని, అవకాశాలు రాకున్నా పర్వాలేదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అని సిద్ధాంత్‌ కర్నిక్ చెప్పాడు.

Eha Tv

Eha Tv

Next Story