వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.వరుసగా స్టార్ హీరోలు ఆయనకు అవకాశాలు ఇస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు(Mahesh Babu) మంచి హిట్ ఇచ్చిన అనిల్.. ఆసినిమా తరువాత ఎఫ్3తో(F3) కామెడీ వరద పారించాడు. ఇక తాజాగా నందమూరి నటసింహం.. గ్లోబల్ లయన్.. బాలయ్య తో భగవంత్ కేసరి(Bagavanth Kesari) సినిమా చేస్తున్నాడు అనిల్.

వరుసగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ వస్తున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi).. తాజాగా ఆయన మెగాఆఫర్ పొందినట్టు తెలుస్తోంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే..?

వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.వరుసగా స్టార్ హీరోలు ఆయనకు అవకాశాలు ఇస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు(Mahesh Babu) మంచి హిట్ ఇచ్చిన అనిల్.. ఆసినిమా తరువాత ఎఫ్3తో(F3) కామెడీ వరద పారించాడు. ఇక తాజాగా నందమూరి నటసింహం.. గ్లోబల్ లయన్.. బాలయ్య తో భగవంత్ కేసరి(Bagavanth Kesari) సినిమా చేస్తున్నాడు అనిల్. ఈసినిమా హిట్ అయితే అనిల్ రేంజ్ మరోసారి మారిపోబోతోంది. ఈక్రమంలో అనిల్ మెగా ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), వరుణ్ తేజ్(Varun Tej) లతో సినిమాలు చేశాడు అనిల్. ఇక ఈసారి బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా మూవీ భోళా శంకర్‌'(Bhola shankar) వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, మరో రెండు మెగా చిత్రాలు త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నాయి. అయితే తాజాగా చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

అనిల్‌ రావిపూడి రీసెంట్ గా మెగాస్టార్ కు ఓ కథను వినిపించాడట. ఈ స్టోరీ లైన్ ఆయనకు భాగా నచ్చేసిందట. అందుకు మెగాస్టార్‌ గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ ఇన్‌సైడ్‌ టాక్‌. పూర్తి వినోదాత్మకంగా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. బాలయ్యతో భారీగా ప్లాన్ చేసిన అనిల్ .. మెగాస్టార్ తో ఇంకా ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తాడా అని అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో.

Updated On 17 July 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story