వీరసింహారెడ్డి వంటి సూపర్‌ హిట్‌ను అందించిన బాలకృష్ణ(Balakrishna) ఇప్పుడు భగవంత్‌ కేసరిగా(Bhagavanth Kesari) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్‌ రావిపూడి(anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్‌ పెద్దిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడిగా కాజల్‌(Kajal aggarwal) నటిస్తున్నారు.

వీరసింహారెడ్డి వంటి సూపర్‌ హిట్‌ను అందించిన బాలకృష్ణ(Balakrishna) ఇప్పుడు భగవంత్‌ కేసరిగా(Bhagavanth Kesari) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్‌ రావిపూడి(anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్‌ పెద్దిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడిగా కాజల్‌(Kajal aggarwal) నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో శ్రీలీల(sreeleela) నటిస్తున్నారు. అర్జున్‌ రాంఫాల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మారేడుమిల్లిలో జరుగుతోంది. బాలకృష్ణపై ఓ భారీ ఫైటింగ్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి వి.వెంకట్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ వారంలోనే ఆ షెడ్యూల్‌ ముగించి.. వెంటనే రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌ అంశాలతో పాటు అనిల్‌ శైలి వినోదాలు ప్రేక్షకులను అలరిస్తాయని మేకర్స్‌ అంటున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated On 9 Aug 2023 8:36 AM GMT
Ehatv

Ehatv

Next Story