సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన అన్నీ మంచి శకునములే(Ani Manchi Shakunamule) చిత్రం ఈవెంట్‌ ఫీల్‌గుడ్‌తో జరిగి అందరినీ భలేగా ఆకట్టుకుంది. ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఏస్‌ ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్(ashwanidat), అల్లు అరవింద్‌(allu Arvindh) వచ్చారు.

సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన అన్నీ మంచి శకునములే(Ani Manchi Sakunamule) చిత్రం ఈవెంట్‌ ఫీల్‌గుడ్‌తో జరిగి అందరినీ భలేగా ఆకట్టుకుంది. ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఏస్‌ ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్(ashwanidat), అల్లు అరవింద్‌(allu Arvindh) వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా ధియేటర్‌ ముందు వాళ్ళు ముగ్గురూ నిలుచున్న ఫ్లెక్సీని ఎరేంజ్‌ చేశారు నిర్మాతలు స్వప్నాదత్‌ అండ్‌ ప్రియాంకదత్. వాళ్లు ముగ్గురూ లిఫ్ట్‌లోనుంచి బైటకు రాగానే ఆ ఫ్లెక్సీ చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్‌తో పాటూ, ఎంతో హేపీగా ఫీలయ్యారు. ముగ్గురికీ ముగ్గురూ చాలా యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఫ్లెక్సీ చూడగానే, అశ్వనీదత్‌ అలాగే ఉండిపోతే ఎంత బావుండేది అన్నారు తన ఇమేజ్‌ని చూసి. తర్వాత వచ్చిన అల్లు అరవింద్‌ మన ముగ్గురం ఫ్లెక్సీలో ఉన్న మన ఇమేజెస్‌ ముందే నిలబడి కొత్తగా ఇప్పుడు ఫొటో తీయించుకుందామని ఐడియా ఇచ్చారు. మీడియా మొత్తం హీరోలను చూసినట్టుగా కెమెరాలతో విపరీతమైన సందడి చేసేశారు.

ఈ సెషన్‌ తర్వాత జరిగన ఈవెంట్‌ కార్యక్రమంలో ముగ్గురికీ ముగ్గురూ గత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఒక్కసారిగా టైమ్‌ ట్రావెల్‌ చేసి యాభైఏళ్ళ వెనక్కి వెళ్ళి, తమ అనుభవాలను మీడియాతో పంచుకోవడం మీడియాకి కూడా ఒక విచిత్రానుభవమే. తెలియని విషయాలు చాలా తెలియడానికి అవకాశం దొరికినట్టయింది. అశ్వనీదత్‌ మాట్లాడుతూ యాభై ఏళ్ళ క్రితం తాను మద్రాసు వచ్చేముందు విజయవాడలోని నవయుగ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అందరూ ఆయనకు ఒక సూచన చేశారుట.

అదే మద్రాసు వెళ్ళగానే అక్కడ ఒకవ్యక్తి ఉంటాడు, చాలా తెలివైనవాడు, ఆయన్ని కలసి ఫ్రెండ్‌షిప్‌ చేసుకోమని చెప్పారని, ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ఆయనే అల్లు అరవింద్‌ అని, ఆనాటినుంచి ఈనాటి వరకూ తమ మధ్యన విడదీయరాని ఆత్మీయానుబంధం అలా చెక్కుచెదరకుండా కొనసాగుతూనే ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని అశ్వనీదత్‌ హార్ట్‌ టచ్చింగ్‌గా మాట్లాడారు. తర్వాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తనకి అశ్వనీదత్‌ కుటుంబంతో ఎటువంటి బంధం పెనవేసుకుందో చెబుతూ సీతారామం సినిమా చూస్తున్నప్పుడు మూడు సార్లు ఏడ్చానని, అందులో రెండుసార్లు సినిమాలో సన్నివేశాలకు, ఒకసారి ఇటువంటి సినిమా తాను తీయలేకపోయినందుకు అని చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగి తేలారు.

పెళ్ళి సందడి సినిమా కోటి రూపాయలతో తీస్తే 14కోట్లు కలెక్ట్‌ చేసిందని ముగ్గురం కులాసాగా పంచుకున్నామని రాఘవేంద్రరావు చెప్పారు. తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌, పెళ్ళి సందడి, గంగోత్రి సినిమాలు తీశామని జ్ఞాపకాల వీధిలోకి చెట్టాపట్టాలేసుకుని ముగ్గురూ మళ్ళిపోయారు. అదే తానూ, అల్లు ఆరవింద్‌ కలసి హౌరా మెయిల్‌ సినిమా తీసి, అక్షరాల 14కోట్లు పోగొట్టామని, అయినా బాధపడలేదు. మరో రౌండ్‌ ఎక్కువ తాగి హాయిగా ఇంటికి వెళ్ళిపోయామని అశ్వనీదత్‌ చెప్పడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది.
ఇందులో భాగంగానే నిర్మాత స్వప్నాదత్‌ మాట్లాడుతూ రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌లతో తనకున్న అటాచ్‌మెట్‌ గురించి చెప్పారు. ఏదైనా క్రైసిస్‌ వచ్చినప్పుడు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి డిస్కస్‌ చేస్తానని, డిస్కస్‌ చేయలేని పరిస్థితే అయితే అల్లు అరవింద్‌ని కల్సి అశ్వనీదత్‌గారిని తిట్టుకుంటానని నవ్వుతూ చెప్పడం వాళ్ళ సెంటిమెంటల్‌ బాండ్‌ని జ్ఞాపకాల సాక్షిగా తేటతెల్లం చేశారు.
అన్నీ మంచి శకునములే చిత్రానికి అన్నీ మంచి శకునాలే ఉన్నాయని, సీతారామం లాంటి ఓ గొప్పసినిమాయే దీనికి శుభశకునం అని రాఘవేంద్రరావు చెప్పడంతో సినిమాకి పండగవాతావరణం అద్దినట్టియింది. "Written by Nagendra Kumar"

Updated On 9 May 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story