ఇప్పుడు చాలా మంది కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నారు. పెళ్లిపై అంతగా ఇంట్రెస్ట్‌ చూపడం లేదు. అన్ని రంగాల్లోనూ ఈ రకమైన టెండన్సీ ఉంది. సినిమారంగం(Film industry) ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌(Salmaan Khan) మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నాడు. మన దగ్గరేమో ప్రభాస్‌(Prabhas).. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. హీరోయిన్లలో అనుష్క(Anushka), త్రిష(Trisha), ఆండ్రియా, శోభన, శాంతి కృష్ణన్‌ ఇలా చాలా మంది పెళ్లికి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు చాలా మంది కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నారు. పెళ్లిపై అంతగా ఇంట్రెస్ట్‌ చూపడం లేదు. అన్ని రంగాల్లోనూ ఈ రకమైన టెండన్సీ ఉంది. సినిమారంగం(Film industry) ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌(Salmaan Khan) మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నాడు. మన దగ్గరేమో ప్రభాస్‌(Prabhas).. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. హీరోయిన్లలో అనుష్క(Anushka), త్రిష(Trisha), ఆండ్రియా, శోభన, శాంతి కృష్ణన్‌ ఇలా చాలా మంది పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇందులో ఆండ్రియా జెర్మియ(Andrea Jeremiah) ప్రత్యేకం. బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్ నటి. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటుంది. పాటలు కూడా చక్కగా పాడుతుంది. ఇటీవల వెంకటేశ్‌(Venkatesh) హీరోగా వచ్చిన సైంధవ్‌లో(Saindhav) నటించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు ఆమె నుంచి టపీమని వచ్చిన సమాధానం నో అని! ఇదే ప్రశ్నను త్రిషను అడిగితే లేటైనా సరే చేసుకుంటానని చెప్పింది. ఆండ్రియా మాత్రం చేసుకోనంటే చేసుకోనని గట్టిగా చెబుతోంది. అసలు పెళ్లితో పనేంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది. పాతికేళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చింది కానీ అప్పట్లో ఎందుకో కుదర్లేదని, ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని, ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని కరాఖండిగా చెప్పేసింది. పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ప్రశ్నించింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని, అంచేత ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా చెప్పింది. ఈమె నటించిన పిశాచి 2 సినిమా త్వరలో విడుదల కానుంది. ఆండ్రియా గతంలో సంగీత దర్శకుడు అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. అయితే తర్వాత వీరిద్దరు కలిసినట్టు లేదు. బహుశా వీరిద్దరు విడిపోయి ఉంటారేమో! బ్రేకప్‌ తర్వాత ఆండ్రియా ఈ కఠిన నిర్ణయం తీసుకుందేమో! అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసిందేమో! ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు నెటిజన్లు.

Updated On 28 Feb 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story