ఆండ్రియా జర్మియా(Andrea Germia). చెన్నైలోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంలో మక్కువ పెంచుకున్నారు. పియానో నేర్చుకున్నారు. పియానోను అద్భుతంగా పలికించగలరు. ఈమె న్యాయవాది(Lawyer) అన్న విషయం చాలా మందికి తెలియదు. నటిగా వెండితెరపై మెరవడానికి ముందు గాయనిగా(Singer) సినీరంగంలో ప్రవేశించారు.
ఆండ్రియా జర్మియా(Andrea Jeremiah). చెన్నైలోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంలో మక్కువ పెంచుకున్నారు. పియానో నేర్చుకున్నారు. పియానోను అద్భుతంగా పలికించగలరు. ఈమె న్యాయవాది(Lawyer) అన్న విషయం చాలా మందికి తెలియదు. నటిగా వెండితెరపై మెరవడానికి ముందు గాయనిగా(Singer) సినీరంగంలో ప్రవేశించారు. గాయనిగా గుర్తింపు పొందిన తర్వాత కోలీవుడ్‌లో పచ్చైక్కిళి ముత్తుచ్చారం(Pachaikkili Mutuchcharam) సినిమాతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత మంగత్తా, విశ్వరూపం, తడాఖా, మాస్టర్, వడచెన్నై తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒక్క తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం వంటి భాషాలలో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు.
36 ఏళ్ల ఈ అవివాహిత అందాల భామ ఇప్పటికీ నటిగా, గాయనిగా బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల పుష్ప చిత్రం తమిళ వెర్షన్‌లో ఊ అంటావా మామ పాటను పాడి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ పాట ఆండ్రియాకు క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే వ్యక్తిగతంగా ఆండ్రియా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల దర్శకుడు వెట్రిమారన్(Vetrimaran) రూపొందించిన అనల్ మేల్ పణితులి(Anal Male Panithuliye) సినిమాలో ఆండ్రియా అర్థ నగ్నంగా(Half Nude) నటించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇటీల ఓ సమావేశంలో ఆండ్రియా స్పందించారు. 'ఆ సినిమాలో నేను అర్థ నగ్నంగా నటించిన విషయం వాస్తవమే. ఆ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు నాకే చాలా బిడియంగా అనిపించింది. అయితే నిజ జీవితంలో నాకు ఇంతకు మంచిన సంఘటనలు జరిగాయి' అని ఆండ్రియా చెప్పారు. ప్రస్తుతం ఆండ్రియా జర్మియా పిశాచి 2(Pisachi), మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోనీ చిత్రం అనే సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అదే విధంగా తెలుగులో సైంధవ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.