ప్రస్తుతం ఆండ్రియా వయసు 39 సంవత్సరాలు. ఆమెను పెళ్లి ఎప్పుడు అని
ఆండ్రియా.. అటు సింగింగ్ తోనూ, ఇటు నటనతోనూ ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఉంది. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె ఏ మాత్రం దాపరికం లేకుండా బయటపెడుతూ వస్తోంది. ఇప్పటికే తన లవ్ లైఫ్ గురించి బయట పెట్టేసింది ఆండ్రియా. ఇక తన జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి కూడా ఆండ్రియా తెలిపింది. 11 సంవత్సరాల వయసులోనే తనని ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని వివరించింది ఆండ్రియా. బస్సులో వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి తన టీ షర్ట్ లో చేయి వేసి ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగిన వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేక ఏడుపు మొదలుపెట్టానని ఆండ్రియా తెలిపింది.
ప్రస్తుతం ఆండ్రియా వయసు 39 సంవత్సరాలు. ఆమెను పెళ్లి ఎప్పుడు అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై ఆమె కుండబద్దలు కొట్టేసింది. తనకు పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది. 20-25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అయితే అనుకున్నానని.. కానీ ఆ సమయంలో కుదరలేదని తెలిపింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా చాలా సంతోషంగా ఉంటానని తెలిపింది. ఈ జీవితానికి అలవాటు పడ్డానని.. ఇప్పుడు లేదా భవిష్యత్తులో వివాహం గురించి ఆలోచనలు అయితే లేవని తెలిపింది. ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని వివరించింది.