యాంకర్‌ విష్ణుప్రియ(Anchor Vishnu Priya)కు ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. అనసూయ, రష్మీలకున్నంత కాదుకానీ విష్ణుప్రియకు కూడా బోల్డంత క్రేజ్‌ ఉంది. అసలు విష్ణుప్రియ కోసమే షోలు చూసేవాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఇప్పుడు ఆమె బాధల్లో ఉన్నారట! షార్ట్‌ ఫిల్మ్‌ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన విష్ణుప్రియ తర్వాత ప్రముఖ చానెల్‌లో పలు షోలకు యాంకరింగ్‌ చేశారు.

యాంకర్‌ విష్ణుప్రియ(Anchor Vishnu Priya)కు ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. అనసూయ, రష్మీలకున్నంత కాదుకానీ విష్ణుప్రియకు కూడా బోల్డంత క్రేజ్‌ ఉంది. అసలు విష్ణుప్రియ కోసమే షోలు చూసేవాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఇప్పుడు ఆమె బాధల్లో ఉన్నారట! షార్ట్‌ ఫిల్మ్‌ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన విష్ణుప్రియ తర్వాత ప్రముఖ చానెల్‌లో పలు షోలకు యాంకరింగ్‌ చేశారు. పండుగ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లలో డాన్స్‌లు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. లాస్టియర్‌ వచ్చిన వాంటెడ్‌ పండుగాడ్‌ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇటీవల వచ్చిన దయ వెబ్‌ సిరీస్‌లో జర్నలిస్టుగా నటించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం విష్ణుప్రియకు అవకాశాలు రావడం లేదు. లేటెస్ట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టారు. 'ఆరోగ్యం పాడైంది. కెరీర్‌ దెబ్బతింది. షెడ్యూల్‌, రిలేషన్స్‌ ఇలా అన్న ఖరాబ్‌ అయ్యాయి. అయినా సరే చిల్ అవుతున్నా' అని టెక్ట్స్‌ ఉన్న రీల్‌ను తన స్టోరీలో షేర్‌ చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. విష్ణుప్రియ అనారోగ్యం బారినపడ్డారా అని బాధపడుతున్నారు.

Updated On 30 Oct 2023 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story