యాంకర్ కమ్ నటి వర్షిణి(Varshini) పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. ఆమె తెలుగువారికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సినిమాలలో చిన్నచిన్న పాత్రలు వేస్తూ లీడ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యలో టీవీ షోలు చూస్తూ విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. ఢీ డ్యాన్స్ షోతో(Dhee Dance Show) పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కు(comedy programs) యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
యాంకర్ కమ్ నటి వర్షిణి(Varshini) పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. ఆమె తెలుగువారికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సినిమాలలో చిన్నచిన్న పాత్రలు వేస్తూ లీడ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యలో టీవీ షోలు చూస్తూ విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. ఢీ డ్యాన్స్ షోతో(Dhee Dance Show) పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కు(comedy programs) యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఆమె ప్రేమ గురించే సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి చర్చ వచ్చినప్పుడల్లా వర్షిణి క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. గతంలో కమెడియన్ హైపర్ ఆదితో(Hyper aadhi) కలిసి డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేశారు వర్షిణి. ఆ షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.
దాంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా వర్షిణి స్పందించారు. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని స్పష్టం చేశారు. ఫ్యాన్స్‌తో ముచ్చటించిన వర్షిణికి నెటిజన్ల నుంచి రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఓ నెటిజన్ అయితే పెళ్లి చేసుకుందామని వర్షిణికి ప్రపోజ్ చేశాడు. దీనిపై స్పందించిన వర్షిణి మా అమ్మతో మాట్లాడమని చెప్పారు. ఆ మధ్యన ఐపీఎల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తునన వాషింగ్టన్ సుందర్‌తో వర్షిణి ప్రేమలో ఉందనే వదంతులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్‌మెంట్ షోలు చేసే డైరెక్టర్‌తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని అంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందుకే ఈ మధ్యన వర్షిణి పెళ్లి గురించి జోరుగా వదంతులు వస్తున్నాయని చెబుతున్నారు. లీదు.