సుమ కనకాల. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత యాంకర్‌గా మారి అద్భుతమైన ప్రతిభతో తనదైన స్దాయిలో ముద్ర వేసుకుంది. యాంకరింగ్‌లో అడుగుపెట్టి, యాంకరింగుకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఏ రంగం అయినా సరే ఒడిదుడుకులు ఎదురవుతాయి వాటిని దాటుకుంటూ కష్టపడితే ఫలితం ఉంటుంది అని నిరూపించింది. పుట్టింది కేరళలో అయిన తెలుగును తెలుగువారికంటే కూడా బాగా నేర్చుకొని ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏళ్లు గడుస్తున్నా ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకపోగా, తెలుగు వాళ్లు సొంత ఆడపడుచుగా ట్రీట్‌ […]

సుమ కనకాల. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత యాంకర్‌గా మారి అద్భుతమైన ప్రతిభతో తనదైన స్దాయిలో ముద్ర వేసుకుంది. యాంకరింగ్‌లో అడుగుపెట్టి, యాంకరింగుకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఏ రంగం అయినా సరే ఒడిదుడుకులు ఎదురవుతాయి వాటిని దాటుకుంటూ కష్టపడితే ఫలితం ఉంటుంది అని నిరూపించింది. పుట్టింది కేరళలో అయిన తెలుగును తెలుగువారికంటే కూడా బాగా నేర్చుకొని ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏళ్లు గడుస్తున్నా ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకపోగా, తెలుగు వాళ్లు సొంత ఆడపడుచుగా ట్రీట్‌ చేసే స్టేజ్‌కి చేరుకుంది. సుమ లేని టీవీషోలు, ఈవెంట్‌ ఊహించుకోవడం కష్టమనేలా యాంకరింగ్‌కు కొత్త భాష్యం చెప్పారు.

మహిళలు ఎంతగానో అభిమానించే ఈటీవీలో ప్రసారమయిన స్టార్‌ మహిళ ప్రోగ్రాంను దాదాపు 15ఏళ్లుగా వన్‌ ఉమెన్ షోగా సుమనే హోస్టు చేసింది. అలా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క ఈటీవీలో మాత్రమే కాకుండా అన్ని ఛానళ్లలోను ప్రోగ్రామ్‌లను సింగిల్‌ హ్యాండ్‌తో నడిపించేస్తుంటుంది. సుమ యాంకరింగ్ చేసే టీవీ ప్రోగ్రాంలో ఒకవేళ కంటెంట్ వీక్‌గా ఉన్నా తన మాటలు, పంచులు, టైమింగ్‌లు షోను హైలెట్‌గా మారుస్తాయి. సుమ డేట్స్ ఖాళీ లేకపోతే స్టార్ హీరోలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ వాయిదా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈవెంట్‌ సమయంలో స్టార్ హీరోలు ఈమె పంచులకు, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో అని జంకుతారు. స్టార్ హీరోలకు కూడా లేనంత బిజీగా లైఫ్‌ లీడ్ చేస్తున్న 4, 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నేర్పును సొంతం చేసుకుంది.

అయితే, ఈ మధ్య సుమ యాంకరింగ్ మానేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈటీవీలో న్యూయర్‌కు ప్రసారం కాబోతున్న వేరీజ్‌ ద పార్టీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో. ఈ ఈవెంట్‌కు సుమ యాంకర్‌గా వ్యవహరించారు. షో లాస్టులో కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ ఏళ‌్ల తరబడి యాంకరింగ్ చేస్తన్న సుమను సన్మానించుకుందాం అన్నారు. అంతేకాదు, ఆమెకు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. ఆ సమయంలో సుమ కన్నీరు పెట్టుకుని నేను మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో అభిమానించి ఆదరించారు.... నేను ఈ స్దాయిలో ఉన్నానంటే తెలుగు ప్రజల ఆదరాభిమానాలే కారణం. వీళ్లు లేకపోతే నేను లేను.ఇది రాసిపెట్టుకోండి. వీళ్లందరికి నేను ఎళ్లప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పడంతో సుమ యాంకరింగ్‌ మానేస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి.

అంతేకాదు, తాను విరామం తీసుకోబోతున్నట్లు కూడా సుమ ప్రకటించారు. ఇందుకు కారణం బిజీ షెడ్యూల్స్‌లో పడి ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నానని కవర్‌ చేసింది. కేవలం తినడానికి పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళ్లున్నానంటూ ఆవేదన చెందింది. ఇదే జీవితం అంటూ కన్నీటి పర్యంతమైంది. దీంతో సుమ యాంకరింగ్ మానేస్తారన్న వార్తను అభిమానులు జీర్ణించేకోలేకపోయారు. అంతా నిజమే అనుకున్నారు.కానీ డిసెంబర్ 31 రాత్రి ఈటీవీలో ప్రసారమైన ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్‌లో అంతా నిజం కాదని తేలిపోయింది. చివరకు తాను ఎంటర్‌టైన్‌మెంటు కోసమే పుట్టాను. ఎక్కడికి వెళ్లడం లేదు అని తేల్చిచెప్పారు. అలా సుమ యాంకరింగ్ మానేస్తుంది అన్న వార్తకు పుల్‌స్టాప్ పడిపోయింది. సుమ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సుమ ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంటుకు బుల్లితెర షోల వాగ్దానాలు, ఏడుపు ప్రోమోలు నమ్మకూడదని జనాలు ఫిక్స్ అయ్యారు.

Updated On 7 Feb 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story