పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారని.. అందుకు రష్మీ నో చెప్పినట్లు
మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం. థియేటర్లలో పర్వాలేదనిపించే రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో నటి పూర్ణ కనిపిస్తుంది. అయితే పూర్ణ చేయాల్సిన పాత్రను మొదట బుల్లితెర యాంకర్ రష్మీని అడిగారని కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలపై రష్మీ స్పందించింది. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్న వార్తలకు ఒక్క పోస్టుతో సమాధానం చెప్పింది రష్మీ.
పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారని.. అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా రష్మీ స్పందిస్తూ.. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అలాంటప్పుడు తాను ఎలా రిజెక్ట్ చేయగలనని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం సినిమా విడుదలైంది. గుంటూరు కారం తెలుగు వెర్షన్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ ట్రెండ్స్ 4వ స్థానంలో, తమిళ వెర్షన్ ట్రెండ్స్ ఇండియాలో 7వ స్థానంలో ఉన్నాయి. తెలుగు వెర్షన్ 2 మిలియన్ వ్యూస్‌తో 6వ స్థానంలో ఉండగా, హిందీ వెర్షన్ 1.1 మిలియన్ వ్యూస్‌తో 10వ స్థానంలో ఉంది. తెలుగు, హిందీ వెర్షన్లు కలిపి 3.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అన్ని ఇతర భాషలతో కలిపి వీక్షకుల సంఖ్య 4 మిలియన్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. సోషల్ మీడియాలో నెగిటివ్ మౌత్ టాక్, రివ్యూలు వచ్చిన ఓ ప్రాంతీయ చిత్రానికి 3 రోజుల్లో నాలుగు మిలియన్ వ్యూస్ రావడం ఒక సంచలనమనే చెప్పొచ్చు.