యాంకర్ ఝాన్సీ(Anchor Jhansi) వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్(Srinu) గుండెపోటుతో మృతి చెందాడు. 35 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందడంతో యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. దీంతో యాంకర్ ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్ చేసింది. శ్రీనివాస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శ్రీను, ముద్దుగా శీను బాబు అని పిలుచుకుంటా. నాకు ముఖ్యమైన సపోర్ట్ సిస్టమ్. తొలుత శీను హెయిర్ స్టైలిస్ట్‌గా ప్రారంభించి, నా వ్యక్తిగత సహాయకుడిగా నా పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. అతను నాకు రిలీఫ్, నన్ను బ్యాలెన్స్ చేసేవాడు, అతడే నా బలం.చాలా సున్నితమైనవాడు, నిజాయితీగా పనిచేసేవాడు. శీను నా స్టాఫే కాదు, నా కుటుంబ సభ్యుడు కూడా. నా కుటుంబాని అండదండలందించాడు.
నా తమ్ముడిలాంటి వాడు.
35 ఏళ్లకే గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. చాలా బాధగా ఉంది. ఈ వార్త నన్ను కలిచివేసింది. మాటలు రావడం లేదు. జీవితం నీటి బుడగలాంటిందంటూ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది ఝాన్సీ. ఈ పోస్టుపై చాల మంది రిప్లైలు ఇస్తున్నారు. ఝాన్సీ పీఏ అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా సెలబ్రెటీల రెమ్యునరేషన్, డేట్స్ అన్నీ పీఏలు చూసుకుంటారు. సెలబ్రెటీల ఫ్యామిలీస్‌లో జరిగే కార్యక్రమాల్లోనూ వీరి పాత్ర కీలకంగా ఉంటుంది. దీంతో పీఏలతో సెలబ్రెటీలకు బాండింగ్ ఏర్పడుతుంది. ఇందువల్లే యాంకర్ ఝాన్సీ ఎమోషనలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మంచి పేరే తెచ్చుకున్నారు ఝాన్సీ. ఎన్నో సినిమాల్లో తన పాత్రలతో ఝాన్సీ మెప్పించారు. పలు టీవీ ఛానెళ్లలో యాంకర్‌గాను పనిచేశారు. సినిమా ఫంక్షన్లకూ వ్యాఖ్యతగా ఝాన్సీ వ్యవహరిస్తున్నారు.