✕
Actor Sreemukhi : ఆ ఇంటర్వ్యూ తర్వాత శ్రీముఖికి క్యూ కట్టిన సినీ ఆఫర్లు.. !
By EhatvPublished on 20 April 2023 2:10 AM GMT
ఈ భామ అదుర్స్ (Adhurs) అనే ప్రోగ్రామ్ యాంకర్‌గా అవతారమెత్తింది. 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన 'జులాయి' (Julai) చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఇక ఆ తర్వాత ' ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంలో నటించింది. అయితే టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో శ్రీముఖి ఒకరు.

x
Sreemukhi Anchor
-
- యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట. ఆమె హీరోయిన్ కాకపోయినా.. హీరోయిన్ (Heroine) అయినంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు. ఎందుకంటే ఆమె ఔట్ ఫిట్స్ నుంచి మొదలు పెడితే ఫిజిక్ వరకు ఓ రేంజ్లో మెయిన్‌టెన్ చేస్తుంది మరి. ఇక శ్రీముఖి (Sreemukhi) ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే ఇక ఆ షో అంతా నవ్వులు పువ్వులు అవ్వాల్సిందే. అంతలా ఆమె హ్యూమర్‌తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తుంది ఈ చబ్బీ బ్యూటీ.. కాదు.. కాదు.. స్మైలీ బ్యూటీ.
-
- ఈ భామ అదుర్స్ (Adhurs) అనే ప్రోగ్రామ్ యాంకర్‌గా అవతారమెత్తింది. 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన 'జులాయి' (Julai) చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఇక ఆ తర్వాత ' ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంలో నటించింది. అయితే టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో శ్రీముఖి ఒకరు.
-
- ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె హోమ్ టౌన్ నిజామాబాద్. ఆమె తెలంగాణ పిల్ల కావడంతోనో ఏమో 'రాములమ్మ' (Ramulamma) అనే బిరుదు కూడా వచ్చేసింది. ఎక్కువ శాతం ఆమెను రాములమ్మగానే ట్రీట్ చేస్తుంటారు నెటిజన్లు. ఆమె తండ్రి రామ్‌కిషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. తల్లి లత బ్యూటీషియన్. ఆమెకు సుశ్రుత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రీముఖి చదువులో ఏమీ తక్కువ కాదు.. టెన్త్, ఇంటర్లో ఆమె 90 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుందట.
-
- ఆ తర్వాత వైద్య విద్య చదవవాలనుకుని బీడీఎస్‌లో సీటు కూడా సంపాదించింది. ఈ మధ్యలో టీవీ యాంకర్‌గా అవకాశం రావడంతో ఆ చదువును మధ్యలోనే ఆపేసింది రాములమ్మ. అలా మొదటి అవకాశం 'అదుర్స్' ప్రోగ్రామ్‌తో ఆమెకు దక్కింది. ఆ తర్వాత సూపర్ సింగర్స్ 9 (Super Singers 9) అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించి అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటు టీవీ షోలు చేస్తూనే.. సినీ రంగం వైపు అడుగులు వేసింది శ్రీముఖి (Sreemukhi).
-
- ఆ ప్రయత్నాల్లో భాగంగానే మాటల మాంత్రికుడు చిత్రంలో ఆమెకు అవకాశం లభించింది. ఆ సినిమాలు అల్లు అర్జున్ (Allu Arjun)కు చెల్లెలు రాజీ క్యారెక్టర్‌తో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చేసిన తర్వాత తమిళంలో ఎట్టుదిక్కుం మధయానై (Ettuthikkum Madhayaanai) చిత్రంలో అటు తమిళ ఆడియన్స్‌ను అలరించింది.
-
- ఇటు యాంకరింగ్‌తోపాటు సినిమాలు చేస్తూ ఈ భామ రాకెట్లా దూసుకెళ్తోంది. ప్రస్తుతం రాములమ్మకు వరుసపెట్టి ఆఫర్లు మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ' భోళా శంకర్' (Bhola Shankar) సినిమాలో ఈ భామ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోందట. ఇందులో హీరోతోపాటు ఫుల్ లెన్త్రోల్ చేస్తుందట.
-
- అంతకంటే ముందు చిరంజీవి 'గాడ్ ఫాదర్' (Godfather) చిత్ర ప్రమోషన్స్‌లోనూ శ్రీముఖి పార్టిసిపేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవిని ఆ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూను స్పెషల్ ఫ్లైట్‌లో నిర్వహించింది ఈ భామ. ఆ ఇంటర్వ్యూ తర్వాత చిరు నెక్ట్స్ మూవీ అయిన 'భోళా శంకర్' చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.
-
- మరోవైపు రీసెంట్గా ఓపెనింగ్ జరుపుకున్న అనిల్ రావిపుడి(Anil Ravipudi)-బాలయ్య బాబు(Balayya Babu) సినిమాలోనూ శ్రీముఖి ఓ మెయిన్ క్యారెక్టర్ చేయబోతుందని అంటున్నారు ఆమె సన్నిహితులు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు కూతురు క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల(Sreeleela)కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తుందట. ఇవే కాకుండా నాగార్జున, వెంకటేష్ చేస్తున్న ప్రాజెక్టుల్లోనూ మెరవనుందట శ్రీముఖి.
-
- ఇటు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సైన్ చేస్తోందట ఈ భామ. జీ5(zee5), అమెజాన్ ప్రైమ్ (amazon prime) ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్మించే ప్రాజెక్టుల్లో శ్రీముఖి కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయబోతుందట. ఏది ఏమైనా ఆ ఇంటర్వ్యూ తర్వాత శ్రీముఖి ఫేట్ మారిందంటున్నారు నెటిజన్లు. ఇంత బిజి షెడ్యూల్ లో ఉన్నా కూడా శ్రీముఖి తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫొటోలను అప్ డేట్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 22.3k ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story