బాలయ్య బాబు(Balayya babu) డైలాగ్స్ కు ఫిదా అయ్యాను అన్నారు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ(Anasuya). రీసెంట్ గా రిలీజ్ అయిన భగవంత్ కేసరి(Bhagavanth kesari) సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ జీవితంలో మర్చిపోలేను అన్నారు.

బాలయ్య బాబు(Balayya babu) డైలాగ్స్ కు ఫిదా అయ్యాను అన్నారు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ(Anasuya). రీసెంట్ గా రిలీజ్ అయిన భగవంత్ కేసరి(Bhagavanth kesari) సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ జీవితంలో మర్చిపోలేను అన్నారు.

భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు నటసిహం బాలకృష్ణ(Balakrishna) వరుస హిట్లతో టాలీవుడ్ లో జోష్ నింపుతున్న నందమూరి హీరో.. ఫ్యాన్స్ ను దిల్ కుష్ చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా తర్వాత భగవంత్ కేసరితో మరోసారి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల(Sreeleela), హీరోయిన్ గా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించారు.

ఇక బాలయ్య డైలాగ్స్ అంటే ఫ్యాన్స్ ప్రాణం పెడతారు. ఎప్పుడు బాలయ్య చెప్పే డైలాగ్స్ ను చాలా మంది విమర్షిస్తూ ఉంటారు. కాని ఈసారి ఆ విమర్షలకు కూడా తావు లేకుండా.. అదరిపోయే డైలాగ్ తో.. అద్భుతం చేశారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి స్పెషల్ గా చెప్పించిన ఈ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రంలో అమ్మాయిలకు బాలయ్య చెప్పే సూచనలు సినిమా చూస్తున్న వారిని కాసేపు షాక్ కు గురి చేస్తాయి. ఏమీ తెలియని చిన్నారుల శరీర భాగాలను కామాంధులు ఎక్కడెక్కడ టచ్ చేస్తారు... అప్పుడు వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని అమ్మాయిలకు వివరిస్తారు. బాలయ్య చెప్పే ఈ మాటల ఆడియన్స్ చేత కన్నీరు పెట్టించారు.

ఈ డైలాగులపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul ravindhran) సోషల్ మీడియాలో స్పందించారు. .. బ్యాడ్ టచ్(Bad touch) గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం భగవంత్ కేసరి సినిమా ద్వారా కేవలం వారం రోజల్లోనే సాధ్యమయిందని... ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే పదేళ్లు పడుతుందని అన్నారు. సినిమా ద్వారా దీన్ని సాధ్యం చేసిన బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ ట్వీట్ కు నటి అనసూయ రీట్వీట్ చేసింది. ఇది నిజం అని.. తన మనసులో ఉన్న మాట రాహుల్ నుంచి బయటకు వచ్చిందన్నారు అనసూయ. బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని అనసూయ ట్వీట్ చేశారు.

Updated On 24 Oct 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story