రాజకీయాల్లోకి(Politics) సినిమావాళ్లు రావడం కొత్తేమీ కాదు. చాన్నళ్ల నుంచి సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారు కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. స్టార్‌ హీరో హీరోయిన్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న నటుల వరకు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలను చూశాం.

రాజకీయాల్లోకి(Politics) సినిమావాళ్లు రావడం కొత్తేమీ కాదు. చాన్నళ్ల నుంచి సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారు కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. స్టార్‌ హీరో హీరోయిన్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న నటుల వరకు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలను చూశాం. రాజకీయాల్లోకి రావాలనే ఉబలాటపడుతున్నవారు ముందుగా రాజకీయ నేపథ్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నేపథ్య కథలో ఎవరైనా నటిస్తే చాలు వారికి రాజకీయాలలో ఏమైనా ఆసక్తి ఉందేమోనన్న అనుమానాలు కలుగుతాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే యాంకర్‌, నటి అనసూయ(Anasuya) విషయంలో జరిగింది. ఈ విషయంపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. అనతి కాలంలోనే అగ్రశ్రేణి యాంకర్‌గా మారిన అనసూయ మంచి నటి కూడా! రంగస్థలం, పుష్ప తదితర సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆమె రజాకర్‌(Razakar) అనే సినిమాలో నటిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమాలో పాట రిలీజ్‌ చేస్తూ ఓ వేడుక నిర్వహించారు. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్య కథ కావడం, నిర్మాత బీజేపీ నేత(BJP) కావడంతో అనసూయ కూడా రాజకీయాలపై ఆసక్తి పెరిగిందా అన్న అనుమానం కలిగించింది చాలా మందికి! అనసూయను జర్నలిస్టులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. దానికి అనసూయ జవాబు ఇస్తూ 'రాజకీయం అనేది నా వల్ల కాదు. చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ల పని వాళ్లని చేయనిద్దాం' అని చెప్పారు. అలానే నిర్మాత బీజేపీ నాయకుడు కదా.. మీ మధ్య ఎప్పుడైనా రాజకీయాల గురించి డిస్కషన్ వచ్చిందా? ఒకవేళ ఆయన ఆహ్వానిస్తే.. ఆ పార్టీలోకి వెళ్తారా? అని అడగ్గా.. 'అసలు మా మధ్య ఆ ప్రస్తావనే ఎప్పుడూ రాలేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చారు.

Updated On 11 Oct 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story