అనసూయ (Anasuya), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వీళ్ళిద్దరూ పర్యక్షంగా కలవకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు వీరిమధ్య ఎదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.. అయితే తాజాగా రౌడీ హీరోపై అనసూయ ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ చేసింది.. దీనికి కారణం విజయ్ నటిస్తున్న సినిమా 'ఖుషి' ఇంతకీ అసలేం జరిగిందంటే..

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో హీరో హీరోయిన్ల పేర్లును ముద్రించారు మేకర్స్. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇందులో విజయ్ పేరు ముందు ‘ది’ అని రాశారు. అయితే ‘ది’ అని రాయటాన్ని యాంకర్, నటి అనసూయ విమర్శించింది. ‘బాబోయ్ ‘ది’ అంట.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’ అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ పోస్ట్ చేసింది.. దీనితో విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అనసూయ పోస్ట్ కు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అనసూయపై ట్రోల్ల్స్తో హీటెక్కిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.. చూడాలి మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో..
‘Morning tweeple!! Felt this is the right way to “wake up” many 😊 This! I personally don’t know a lot of my extended fam page admins.. but I am super proud of the influence I create unlike many others’ ! Not worth the comparison at all.. but this is an option too ani cheptunna.. pic.twitter.com/Gimro8EnPW
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 6, 2023