ఫ్రాన్స్(France)లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2024 Cannes Film Festival)లో భారతీయ నటి అనసూయ(Anasuya) సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు నెలకొల్పింది.
ఫ్రాన్స్(France)లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2024 Cannes Film Festival)లో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా(Anasuya Sengupta) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు నెలకొల్పింది. అన్ సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అనసూయకు దక్కింది. బల్గేరియన్ దర్శక, నిర్మాత కాన్‌స్టాంటిన్ బోజనోవ్ రూపొందించిన షేమ్‌లెస్ అనే సినిమాలోని ఆమె పాత్రకుగాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీ(Delhi)లోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన రేణుక అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని సినిమాలో చిత్రీకరించారు. రేణుక పాత్రను కోలకతాకు చెందిన అనసూయనేన్ గుప్తా పోషించారు. అనసూయ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నప్పటికీ ఎక్కువగా ఆమె వెండితెరపై కనిపించలేదు. ముంబాయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న అనసూయ ప్రస్తుతం గోవాలో ఉంటోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మసబా మసబా చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. 2009లో బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్ దత్ సాయంతోనే షేమ్‌లెస్ సినిమాలో నటించింది. ఉత్తమ నటిగా అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ నటి అని తెలియగానే అనసూయ తెగ సంబరపడింది. సమాజం చీదరంగా చూసే ఆ కమ్యూనిటీకి తన అవార్డును అంకితం ఇస్తున్నానని అనసూయ చెప్పింది.