పుష్ప-2 పాత్రతో అసంతృప్తిలో అనసూయ

పుష్ప-2 పాత్రతో అసంతృప్తిలో అనసూయ

2021లో పుష్ప ది రైజ్‌ (Pushpa2) బాక్సాఫిస్‌ను దడదడలాడించింది. మూడేళ్ల తర్వాత పుష్ప 2 ది రూల్ సినిమాలో ఊర మాస్ ఎపిసోడ్లు పెట్టారు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) అద్బుతంగా ప్రతీ ఎపిసోడ్‌లోను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో చేసిన డాన్స్, ఫైట్స్ అమ్మోరి శివతాండవంలా కనిపిస్తుంది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లో అల్లువారబ్బాయి ఉద్వేగానికి గురిచేస్తాడు. అలాగే శ్రీవల్లిగా (Srivalli) రష్మిక మందన్న కొన్ని సీన్లలో మెప్పించింది. శ్రీలీల స్సెషల్ సాంగ్‌లో మెరుపుతీగలా మెరిసింది. షెకావత్‌గా ఫాహద్ ఫాజిల్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు. సునీల్, జగపతి బాబు (Jagapathi Babu) అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ ఫర్వాలేదనిపించారు.


అయితే అనసూయ (Ansuya) పుష్ప దిరైజ్‌లో తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. అయితే పుష్ప-2లో ఆమె పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. హిందీ మార్కెట్‌లో పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్‌ను దాటే అవకాశం ఉంది. పుష్ప 2 యొ అపూర్వ విజయం తర్వాత అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) స్టార్‌డమ్, ప్రజాదరణ భారీగా పెరిగింది. తమ సినిమాలు ఇంతటి భారీ విజయాన్ని సాధించినప్పుడు అందులో పాల్గొన్న నటీనటులు క్రేజ్ పొందుతారు. అయితే పుష్ప-2పై అనసూయ భరద్వాజ్ చాలా ఆశలు పెట్టుకుంది. అనసూయ మంగళం శ్రీను భార్య దాక్షాయణి పాత్రలో నటించింది. సినిమా యొక్క ప్రధాన విలన్‌లలో ఒకరిగా అంచనా వేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అనసూయ దాక్షాయణి పాత్రకు ప్రేక్షకుల స్పందన చూసి తన ఉత్సాహాన్ని కూడా వ్యక్తం చేసింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిరాశపర్చింది. ఆమె చేయగలిగినదంతా చేసినా కానీ సుకుమార్ ఆమెకు ప్రభావమంతమైన పాత్ర ఇవ్వలేదు. దీంతో ఆమె చేసిన సన్నివేశాలు ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఒక టీవీ నటి ఇంత పెద్ద చిత్రంలో నటించడం చాలా అరుదు. ఇలాంటి భారీ విజయం సాధించిన సినిమాల్లో అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది.ఇలాంటి సినిమాలో తన పాత్రతో మెప్పించలేకపోయానని, మెప్పించేంత నిడివి కూడా తన పాత్రకు లేదని అనసూయ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story