యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ఎక్కువ శాతం ఆమె పోస్టులు కాంట్రావర్సీలకు దారి తీస్తుంటాయి. అనసూయ ఏ పోస్టు లేదా వీడియో షేర్ చేసినా నెటిజన్లు నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉంటారు. అనసూయ ఆంటీ అంటూ కూడా కొంత కాలం ట్రెండ్ అయింది ఈ యాంకర్. తన గ్లామర్ ఫోటోస్ పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోదు. మరో వైపు సమాజంలో జరుగుతున్న ప్రతీ అంశంపై ఆమె రియాక్ట్ అవుతూ […]
యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ఎక్కువ శాతం ఆమె పోస్టులు కాంట్రావర్సీలకు దారి తీస్తుంటాయి. అనసూయ ఏ పోస్టు లేదా వీడియో షేర్ చేసినా నెటిజన్లు నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉంటారు. అనసూయ ఆంటీ అంటూ కూడా కొంత కాలం ట్రెండ్ అయింది ఈ యాంకర్. తన గ్లామర్ ఫోటోస్ పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోదు. మరో వైపు సమాజంలో జరుగుతున్న ప్రతీ అంశంపై ఆమె రియాక్ట్ అవుతూ ఉంటుంది.
గట్టిగా చెప్పాలంటే ఆమెను ఎంత ట్రోల్ చేస్తే.. అంత డేరింగ్ గా రియాక్ట్ అవుతా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది అనసూయ. తాజాగా అనసూయ చేసిన కమెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అందాల భామ నెటిజన్లతో ముచ్చటించింది. అయితే ఓ నెటిజన్ అనసూయను తెలివిగా ఓ ప్రశ్నతో కాస్త ఇబ్బందే పెట్టినట్టు అయింది. లెస్బియన్ పై ప్రశ్న సంధించాడు నెటిజన్.
‘‘ మీరు లిబరల్, మెచ్యూర్డ్ ఉమెన్, అయితే ఈ క్వశ్చన్ కు తప్పకుండా సమాధానం ఇవ్వాలి’’ అని అన్నాడు. ‘‘ ఎప్పుడైనా లెస్బియన్స్, గేలతో అనుభవం ఉందా అని అడిగాడు. దానికి ‘ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో చాలా మంది గే లున్నారు. అయితే పర్సనల్ గా నాకు లెస్బియన్ ఎక్స్ పీరియెన్స్ మాత్రం కాలేదు కానీ, ఆన్ లైన్ లో మాత్రం చాలా సార్లు ఆ అనుభవాన్ని ఫేస్ చేశాను’ అని ఓపెన్ గా, డేరింగ్ గా సమాధానం చెప్పింది ఈ అందాల భామ.
అయితే ఆమె ఆన్సర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఆమె ఆన్సర్ ఇచ్చిన తీరు కూడా నెటిజన్స్ ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు ‘‘ మళ్లీ యాంకరింగ్ ఎప్పుడు చేస్తారు’’ అని అడగగా దానికి కూడా ఆమె సమాధానం ఇచ్చింది. ‘టీఆర్పీ కోసం మేకర్స్ అవమానకరమైన స్టంట్స్ చేస్తున్నారు. అటువంటి కల్చర్ పోయినప్పుడు మాత్రమే యాంకరింగ్ చేస్తాను. నేను కూడా యాంకరింగ్ మిస్ అవుతున్నా అంటూ రిప్లై ఇచ్చింది అనసూయ
ఇక ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘మైఖెల్’ చిత్రంలో కనిపించింది. ‘పుష్ప2’, ‘రంగమార్తాండ’ సినిమాల షూటింగ్ చాలా వరకు పూర్తయింది. త్వరలోనే ఈ మూవీస్ విడుదల కానున్నాయి.