తెలుగు రాష్ట్రాల్లో అనసూయ(Anasuya) క్రేజ్ మాములుగా ఉండదన్న సంగతి తెల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో అనసూయ(Anasuya) క్రేజ్ మాములుగా ఉండదన్న సంగతి తెల్సిందే. అనసుయ అడుగులన్నీ సంచలనాలే అన్నట్లు ఉంటాయి.న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అనసూయ యాంకర్‌గా, హీరోయిన్‌గా, ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో తన సత్తా చాటుకుంటోంది.
అనసూయ క్యారెక్టర్ కోసం కొందరు దర్శకులు కథలు కూడా ప్రత్యేకంగా రాస్తున్నారట.అందం , అభినయం కలగలిపి ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తుంటుంది. 38 ఏళ్ల వయస్సులో ఈ హాట్ బ్యూటీ.. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది.
సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే అనసూయ తనపై వచ్చే విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ చేయని శ్రమ ఉండదు.
ఫిజిక్ విషయంలో ఆమె పెట్టే శ్రద్ధను చూసే ఫిదా కావాల్సిందే. అయితే అనసూయ సినిమాలు, బుల్లితెరకే పరిచయం కాలేదు.తెలుగురాష్ట్రాల్లో మాల్స్ ఓపెనింగ్‌లకు పిలిస్తే వెళ్తుంటుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు షాపులు, మాల్స్ ఓపెనింగ్‌లకు పిలిస్తే అనసూయ వాలిపోతుంటుంది.దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు వాలిపోతుంటారు.
అనసూయ వస్తుందంటే ఆవేశంగా అక్కడికి చేరుకుంటుంటారు. ఓపెనింగ్ సెర్మనీలను బట్టి అందంగా తయారై అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది అనసూయ అయితే ఈ షాప్ ఓపెనింగ్‌లకు అనసూయ చార్జి కూడా బాగానే ఉంటుంది. హైదరాబాద్‌లో ఓపెనింగ్స్ ఉంటే రూ.5 లక్షల వరకు చార్జి వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ బయట అంటే ఇతర ప్రాంతాల్లో ఓపెనింగ్‌లకు రూ.5-10 లక్షలు వసూలు చేస్తోందట.
ప్రయాణఖర్చులు, వసతి సౌకర్యం అదనం. అయితే ఎంత ఖర్చైనా వెనుకాడకుండా అనసూయతో ఓపెనింగ్ చేస్తే ఆ క్రేజ్ రావడమే కాకుండా, తమ వ్యాపారం ప్రమోట్ కూడా అవుతుందని వ్యాపారులు భావిస్తున్నారు.అందుకే అనసూయ ఎంత డిమాండ్ చేసినా వెనకాడడం లేదు.. తనతో ఓపెనింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారట.