బేబి(Baby) సినిమాది మామూలు విజయం కాదు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను సంపాదించింది. స్టార్ హీరోల సినిమాలు ఎంత వసూలు చేస్తాయో బేబి చిత్రం ఆ లెవల్లో వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya), విరాజ్ అశ్విన్‌లు(Viraj Ashwin) నటించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు.

Baby Movie In OTT
బేబి(Baby) సినిమాది మామూలు విజయం కాదు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను సంపాదించింది. స్టార్ హీరోల సినిమాలు ఎంత వసూలు చేస్తాయో బేబి చిత్రం ఆ లెవల్లో వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya), విరాజ్ అశ్విన్‌లు(Viraj Ashwin) నటించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. ఎస్‌కెఎన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టిస్తూ వస్తోంది. ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) సినిమా అర్జున్‌రెడ్డిని కూడా బేబి బ్రేక్ చేసింది.
ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. అయినా అదే ఆదరణ. త్వరలో ఓటీటీలో(OTT) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో స్ట్రీమ్ చేయబోతున్నారట! ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. లేటెస్ట్‌గా ఇందులో ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని, అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు ఆనంద్ దేవరకొండ , అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. నాలుగు గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబి కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
