Kaun Banega Carorepathi 15 డిసెంబర్ 29న ముగిసింది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో శుక్రవారంనాడు సీజన్ 15 పూర్తి చేసుకుంది. ఈ క్విజ్ షో విజయవంతం కావడానికి అమితాబ్(Amitabh Bhachchan) కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. బిగ్‌బాస్ షో అంటేనే ముందుగా గుర్తొచ్చేది అమితాబ్ పేరే. ఒకరకంగా చెప్పాలంటే అమితాబ్ లేకుంటే ఈ షో ఇంత సక్సెస్ కాదనడంలో సందేహం లేదని ప్రేక్షకులు అంటుంటారు.

Amitabh Bhachchan

షో సందర్భంగా అమితాబ్ చేసే యాంకరింగ్ అద్భుతమనే చెప్పాలి. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇస్తూ.. కంటెస్టెంట్‌లను ప్రోత్సహిస్తూ షోను నిర్వహించేవారు. సీజన్ 15 ముగిసిన సందర్భంగా ప్రేక్షకులతో పాటు అమితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ
'లేడీస్ అండ్ జెంటిల్మెన్.. ఈ షోకు వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపటి నుంచి కనిపించదు. రేపటి నుంచి ఇక్కడకు రావడం లేదని చెప్పాలనిపించడం లేదని.. ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. ఈ షో ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించింది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాని' అమితాబ్ అన్నారు. చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ కంటతడి పెట్టారు. దీంతో షోకు వెళ్లిన ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.