పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), సుజిత్‌(Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ఓజీ(OG Movie).. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో షెడ్యూల్‌ కూడా ముగిసింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయినట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), సుజిత్‌(Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ఓజీ(OG Movie).. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో షెడ్యూల్‌ కూడా ముగిసింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయినట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. రాబోయే షెడ్యూల్స్‌ మరింత ఆసక్తికరంగా ఉంటాయని, జులై, ఆగస్లులలో జరగనున్న షెడ్యూల్స్‌తో మొత్తం షూటింగ్‌ను ముగించాలని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ తండ్రి పాత్రను పోషించడానికి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అంగీకరించారట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఫిల్మ్‌నగర్‌లో మాత్రం ఈ మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే మాత్రం ఇది రేర్‌ కాంబినేషన్‌ అవుతుంది. పవన్‌, అమితాబ్‌ కనిపించే ప్రతీ సన్నివేశము అదిరిపోతుంది.. అత్యంత భారీస్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated On 27 Jun 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story