జై భీమ్‌(Jai Bheem) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌(TJ Gnanavel). జై భీమ్‌ సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది. సామాజిక సందేశంతో తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ సమయంలో అందరి దృష్టి ఒక్కసారిగా జ్ఞానవేల్‌పై పడిండి. జై భీమ్‌ తర్వాత జ్ఞానవేల్‌ రూపొందిస్తున్న సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే.

జై భీమ్‌(Jai Bheem) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌(TJ Gnanavel). జై భీమ్‌ సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది. సామాజిక సందేశంతో తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ సమయంలో అందరి దృష్టి ఒక్కసారిగా జ్ఞానవేల్‌పై పడిండి. జై భీమ్‌ తర్వాత జ్ఞానవేల్‌ రూపొందిస్తున్న సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. రజనీకాంత్‌(Rajinikanth) నటిస్తున్న 170వ సినిమా ఇది! మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. నాచురల్ స్టార్‌(nani) నాని కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌(Amitabh bachchan), మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌(Fahad fazil) వంటి అగ్ర నటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు లుక్‌ టెస్ట్‌ను రజనీకాంత్‌ పూర్తి చేశారట! ఈ సినిమాలో సామాజిక సమస్యలపై పోరాడే యోధుడుగా రజనీకాంత్‌ కనిపించబోతున్నారని సమాచారం. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలతో పవర్‌ఫుల్‌ సోషల్‌ డ్రామాగా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం జ్ఞానవేల్ ఆ పనుల్లో ఉన్నారట! రజనీకాంత్‌ లేటెస్ట్‌ సినిమా జైలర్‌ ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.

Updated On 5 Aug 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story