80 లో కూడా 40లా జోరుగా హుషారుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అంతే కాదు అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాను కూడా హ్యాండిల్ చేస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుంటాడు. తన అభిమానులతో చిట్ చాట్ లు కూడా చేస్తుంటారు బిగ్. అప్పుడప్పుడు వారు అడిగా ఫన్నీ ప్రశ్నలకు ఫ్న్నీ ఫన్నీ ఆన్సర్లు ఇస్తుంటాడు కూడా.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ప్రతి ఆదివారం తన అభిమానులతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తన ఇంటికి వచ్చిన వారిని ప్రేమగా పలకరిస్తారు బిగ్ బీ.అంతే కాదు.. సోషల్ మీడియాలోనూ(Social media) చురుగ్గా వారితో టచ్ లో ఉంటుంటారు. ఇటీవలే అబితాబ్ తన అభిమానులను పలకరిస్తున్న ఫొటో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అందులో అమితాబ్ డ్రస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. అది అందరిని ఆశ్చర్య పరిచింది. దాంతో కామెంట్లు రకాుండా ఉంటాయా చెప్పండి...

పూల రంగుల చొక్కా, కింద నల్లటి ప్యాంట్ తో దర్శనమిచ్చారు. బహుశా అది ట్రాక్ ప్యాంట్ అయి ఉండొచ్చు. దాని బొందు తాడులు వేలాడుతూ కనిపిస్తున్నాయి.ఓ అభిమాని దీన్ని చలోక్తిగా మలిచాడు. అభిమాని ఏమన్నది, దానికి తాను ఏమని బదులిచ్చిందీ అమితాబచ్చన్ వెల్లడించారు. బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది అని ఓ అభిమాని తనతో అన్నట్టు అమితాబ్ తెలిపారు. ‘‘బ్రదర్ ఇది ప్యాంట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’ అని తాను అన్నట్టు అమితాబ్ పేర్కొన్నారు.

ఇలా ఈ వయస్సులో కూడా బిగ్ బీ అమితాబ్ ఇచ్చిన ఆన్సర్ కు.. ఆయన పెట్టిన పోస్ట్ కు కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి. దీన్ని క్యాప్షన్ ఆఫ్ ది ఇయర్ గా ఓ అభిమాని పేర్కొగా, బిగ్ బీ అన్ని కాలాల్లోనూ గొప్ప వారేనంటూ మరో అభిమాని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం కల్కీ లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు.. కౌన్ బనేగా కరోడ్ పతి కూడా చేస్తున్నారు అమితాబ్.

Updated On 10 Oct 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story