ప్రభాస్(Prabhas) గురించి ఇండియన్ మెగాస్టార్... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్(Amitabh Bachchan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో హైలెట్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యాక్యలతో దిల్ ఖుష్ అవుతున్నారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ప్రభాస్(Prabhas) గురించి ఇండియన్ మెగాస్టార్... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్(Amitabh Bachchan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో హైలెట్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యాక్యలతో దిల్ ఖుష్ అవుతున్నారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ గురించి తెలిసిందే..? ఆయన సినిమా అంటే కోట్లాదిమంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. అందులో ప్రాజెక్ట్ కె(Project K) కూడా ఒకటి. ఈసినిమా కోసం ప్రభాస్ తో మొదటి సారి కలిసి నటిస్తున్నారు ఇండియన్ మెగాస్టార్ అమితాబచ్చన్(Amitabh Bachchan).. ఈక్రమంలో ఆయన ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన అలా అంటారని ఎవరూ ఊహించలేదు కూడా.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్‌ K. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్‌ మూవీ(Science Fiction Movie) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అంతే కాదు ఈసినిమాలో మొదటి సారి ప్రభాస్ తో కలిసి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాలో భాగం కావడం పట్ల మరోసారి తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు బిగ్ బీ.

‘ప్రభాస్‌ లాంటి యాక్టర్‌తో ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం రావడం గౌరవంగా ఫీలవుతున్నా. అందరికీ ధన్యవాదాలు.. నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు నాగి (నాగ్‌ అశ్విన్‌)సార్.. ప్రభాస్ నా పట్ల చూపిన వినయం(Respect), నాకు ఇచ్చిన గౌరవం మనస్సుకు హత్తుకునేలా భావోద్వేగపూరితంగా ఉన్నాయి. నా ఒక్కడికే కాదు.. ప్రాజెక్ట్ Kలో పాలుపంచుకున్న వారందరికీ.. మీ కృషి కొత్త పుంతలు తొక్కాలని ఆశిస్తూ.. ప్రేమతో ప్రార్థిస్తున్నా..’ అని ట్వీట్(Tweet) చేశాడు అమితాబ్ బచ్చన్‌. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రభాస్ గురించి పెద్దాయన స్వయంగా ఇలా మాట్లాడటంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దిల్ ఖుష్ అవుతున్నారు. ఆనందం తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈసినిమాలో... ప్రభాస్ సినిమాలో నటించగా.. కమల్ హాసన్ ప్రభాస్ కు విలన్ గా నటించబోతున్నాడు. వీరితో పాటు... దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్‌తోపాటు ప్రభాస్‌ హ్యాండ్‌ లుక్‌ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Updated On 7 July 2023 11:36 PM GMT
Ehatv

Ehatv

Next Story