బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) సమీపంలో భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలో 930 చదరపు మీటర్ల (10,000 చ.అడుగులు) భూమిని ఆయన కొనుగోలు చేశారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు కొన్ని రోజుల ముందు కొనుగోలు చేశారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (The House of Abhinandan Lodha)లో రూ. 14.50 కోట్లతో ఆయన ఈ భూమిని కొనుగోలు చేశారు.

ఈ భూమి రామమందిరానికి 15 నిమిషాల దూరంలో, శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం(sri Ram International Airport) నుంచి 30 నిమిషాల దూరంలో ఉంది.
సరయూ నది ఒడ్డున 'ది సర్యూ' ప్రాజెక్ట్‌ పేరుతో 51 ఎకరాల 7 స్టార్‌ పాషింగ్‌ కాంప్లెక్స్‌ను HoABL అభివృద్ధి చేస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ.. అయోధ్యలోని ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధాతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలని నేను ఎదురు చూస్తున్నానని తెలిపారు. తన హృదయంలో అయోధ్యకు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నా ఇంటిని నిర్మించడానికి నేను ఎదురు చూస్తున్నానని అమితాబ్‌ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోనే అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ మూలాలు ఉన్నాయి. ఆయన ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్)లో జన్మించాడు, అక్కడే చదువుకున్నాడు. అమితాబ్‌ నిర్ణయంపై HoABL ఛైర్మన్ అభినందన్ లోధా మాట్లాడుతూ.. సరయు ఫస్ట్‌ సిటిజన్‌గా అమితాబ్‌కు వెల్కం చెప్తున్నానన్నారు. అయోధ్య ప్రాజెక్టులో అమితాబ్‌ పెట్టుబడులు పెట్టడం నగరం ఆర్థిక సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసం, ఆధ్యాత్మికత పట్ల ఆయన భక్తిభావం వెల్లడైందని లోధా ప్రశంసించారు.

Updated On 17 Jan 2024 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story